6వసారి: మోడీ విక్టరీ సింబల్, బీజేపీ సంబరాలు: సోనియాతో రాహుల్ భేటీ
Recommended Video

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఢిల్లీ బీజేపీ కార్యాలయంతోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కార్యాలయాల్లో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణులు కూడా ఈ సంబరాలను కొనసాగిస్తున్నాయి.

విక్టరీ సింబల్ చూపుతూ..
కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారవడంతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం11గంటల ప్రాంతంలో పార్లమెంటుకు చేరుకున్నారు. కారు దిగి విజయ చిహ్నం చూపుతూ లోనికి వెళ్లారు. కాగా, మోడీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు.

6వ సారీ బీజేపీనే..
కాగా, తాజా ఫలితాలతో గుజరాత్ రాష్ట్రంలో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుండటం విశేషం. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఊహించిందనేని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నారు. ఈ గెలుపుతో ప్రధాని మోడీకి మరోసారి ప్రజలు తమ మద్దతును తెలియజేశారని అన్నారు.

సోనియాతో రాహుల్ భేటీ.. ఫలితాలపై చర్చ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం ఫలితాలు వెలువడుతుండగానే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తాజా ఫలితాలపై వీరు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

పోటీ ఇచ్చిన కాంగ్రెస్, అక్కడ మాత్రం
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంతకుముందు కంటే మెరుగైన స్థాయిలో పోటీ ఇవ్వడం గమనార్హం. ఒక సమయంలో నువ్వానేనా? అనే స్థాయికి కూడా చేరింది. కానీ, ఆ తర్వాత మళ్లీ బీజేపీ పుంజుకుంది. 182స్థానాలున్న గుజరాత్‌లో మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ ఎలాంటి పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. బీజేపీ ఇక్కడ సునాయాస విజయం సాధించిందనే చెప్పాలి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications