ఒక్క ఫోన్ కాల్ తో లొంగిపోయారు-ట్రంప్ చెప్పింది నిజం..! మోడీపై రాహుల్ ఫైర్..!

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసింది కానీ దీని మీద రాజకీయ మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ ఎన్నికల వేళ ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు ఆపరేషన్ సింధూర్ ను తమ ఖాతాలోకి వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఇరుదేశాల్ని ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ సాయం చేశారనేది నిజమన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ నుండి పిలుపు వచ్చిందని, నరేంద్రజీ వెంటనే లొంగిపోయారని, చరిత్ర దీనికి సాక్ష్యమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

pm modi surrendered with one phone from Donald trump alleges Rahul Gandhi on operation sindoor

1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారు. ఈ యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ విముక్తి పొందిందన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగిందన్నారు. అమెరికా బెదిరింపుల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1971లో పాక్‌ను విచ్ఛిన్నం చేసిందన్నారు. కాంగ్రెస్‌లోని సింహాలు అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడతాయని, అవి ఎప్పుడూ తలవంచవని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుబట్టింది. రాహుల్ విమర్శలు పాకిస్తాన్ ఐఎస్ఐని తలపిస్తున్నాయని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ నేత తుహిన్ సిన్హా ఎన్డీటీవీకి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+