ప్రపంచ భవిష్యత్తును మార్చే శక్తీ మీ సొంతం, H1-B వీసా యూఎస్ లోనే - ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. మోదీ నినాదాలతో వాషింగ్టన్ లోని రోనాల్డ్ రీగన్ భవనం దద్దరిల్లింది. భారత్..యూఎస్ భాగస్వామ్యం 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును మార్చుతుందని ప్రధాని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులు దేశ ప్రతిష్ఠను పెంచుతున్నారని ప్రశంసించారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల బంధం బలోపేతం అవ్వటాన్ని ప్రపంచం గమనిస్తోందని ప్రధాని చెప్పుకొచ్చారు. అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్లారు.

PM Narendra Modi tells the Indian diaspora, This is the best time to invest as much as possible in India

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం: ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి అని..ఆధునిక ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ గా భారత్ నిలుస్తుందని ప్రధాని విశ్లేషించారు. భారత్ నుంచి తరలివెళ్లిన 100 కంటే ఎక్కువ పురాతన వస్తు సముదాయాన్ని తిరిగి ఇవ్వటానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడగించారు.

భారత్‌లో వీలైనంత ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయంగా ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశంలో గుగూల్ AI పరిశోధనా కేంద్రం 100 కంటే ఎక్కువ భాషలలో పని చేస్తుందన్నారు. కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ విప్లవం కొనసాగుతుందని ప్రధాని వివరించారు. గ్రామాల్లోనూ పేమెంట్స్ కోసం బార్ కోడ్స్ కనిపిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి మార్పు స్వల్పం కాలంలోనే వచ్చిందన్నారు.

అనూహ్య ప్రగతి దిశగా: దేశంలో ఎక్కడైనా 24 గంటల్లో ఎప్పుడైనా బ్యాంకింగ్ చేయవచ్చని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని రంగాల్లో పురోగతిలో తాను ఒంటరిగా చేసింది ఏదీ లేదన్నారు. 140 కోట్ల మంది విశ్వాసమే ఈ పురోగతి వెనుక విజయ రహస్యమని ప్రధాని చెప్పుకొచ్చారు.యోగా దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి ప్రధాని కార్యాలయానికి ప్రపంచంలోని పెద్ద సంఖ్యలో దేశాలు కలిసి రావడం అందరికీ గర్వకారణమని చెప్పారు.

అమెరికన్ సూపర్ మార్కెట్లలో మేడిన్ ఇండియా పురోగతి కనిపిస్తుందన్నారు. అది చూసిన సమయంలో ప్రవాస భారతీయులకు ఎంతో గర్వకారణంగా ఉంటుందని చెప్పారు. అమెరికాలో ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారత్ కు చెందిన ప్రతిభావంతులు గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

నాటు నాటు పాట ప్రస్తావించిన ప్రధాని: ప్రపంచం మొత్తం 'నాటు నాటు...' పాటలకు నృత్యం చేస్తున్నప్పుడు ప్రవాస భారతీయులు గర్వంగా ఫీలయ్యే క్షణాలని ప్రధాని అభివర్ణించారు. బెంగళూరు, అహ్మదాబాద్‌లలో అమెరికా కొత్త కాన్సులేట్‌లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. H1B వీసా పునరుద్ధరణ అమెరికాలో చేసేలా నిర్ణయం జరిగిందని వివరించారు. భారత్ - అమెరికా దేశాల మధ్య ఒప్పందాలు మాత్రమే కాదని..జీవితాలను, పౌరుల కలలను సాకారం చేసేలా నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.

గూగుల్ మైక్రోన్, అప్లైడ్ మెటీరియల్స్, ఇతర కంపెనీలు భారత్ లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని ప్రకటించారు. అమెరికా మధ్య కుదిరిన ఆర్టెమిస్ ఒప్పందం అంతరిక్ష పరిశోధనలో అనేక అవకాశాలను అందిస్తుంది. నాసాతో కలిసి భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుందని అందుకే ఆకాశమే హద్దు కాదు అని తాను వ్యాఖ్యానించినట్లు ప్రధాని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+