25న రైతులతో ప్రధాని మోదీ సంవాదం -బీజేపీ నేతృత్వంలో 2500 చోట్ల -నిరసనగా యూపీ-ఢిల్లీ సరిహద్దు బంద్

దేశ రాజధాని ఢిల్లీలో చలితోపాటే రైతుల నిరసనలపై రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. రైతుల నిరసనోద్యమం రాజకీయ ప్రేరితమంటూ విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌లకు ఘాటు రిప్లైతోకూడి లేఖను రైతు సంఘాలు రాశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేయడంతో మోదీ సర్కార్ మరోవైపు నుంచి నరుక్కొచే ప్రయత్నాలను ఆరంభించింది. అందులో భాగంగా బీజేపీ నేతృత్వంలో పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది..

మాజీ ప్రధాని అటల్‌ బీహారీ పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషించనున్నట్లు బీజేపీ ఆదివారం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని 2500కిపైగా ప్రదేశాల్లో 'కిసాన్‌ సంవాద్‌' నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ మేరకు సన్నాహాలను ముమ్మరం చేసింది. యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌సింగ్‌, పార్టీ నేత రాధామోహన్‌ సింగ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఆ పార్టీ శ్రేణులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు.. పేదల, రైతుల సంక్షేమానికి అంకితమైందని, కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని, ఈనెల 25న రైతులతో ప్రధాని మోదీ సంవాదంలో వాస్తవాలను వివరిస్తామని రాధామోహన్‌ సింగ్‌ అన్నారు. ఇప్పటిదాకా రైతుల ఉద్యమంపై కేంద్ర పెద్దలు వ్యతిరేక ప్రకటనలు చేస్తుండగా, ఇప్పుడు బీజేపీ నేరుగా రంగంలోకి దిగి, ప్రధానితో కిసాన్ సంవాద్ నిర్వహిస్తుండటం గమనార్హం. మరోవైపు..

pm Modi to interact with farmers on December 25, protestors to block UP-Delhi border

రైతుల ఉద్యమాన్ని రాజకీయ ప్రేరితమన్న ప్రధాని మోదీకి ఘాటు రిప్లై ఇచ్చిన రైతుల సంఘాలు.. 25న ప్రధాని నిర్వహించబోయే కిసాన్ సంవాద్ పైనా ఆగ్రహం వెళ్లగక్కాయి. ఆందోళనలపై కేంద్రం అదే పనిగా అబద్ధాలను ప్రచారం చేస్తుండటాన్ని నిరసిస్తూ, మోదీ కిసాన్ సంవాద్ చేపట్టే రోజునే(డిసెంబర్ 25న) ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్ద (ఘాజీపూర్ బోర్డర్)ను పూర్తిగా స్తంభింపజేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆదివారాన్ని 'రైతు అమరవీరుల దినం'గా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల్లో రైతు అమరవీరులకు నివాళులు అమర్పించారు. రైతు సంఘాలు పిలుపు మేరకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగనుంది. చలో లో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాత25 రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో 33 మంది రైతులు మృతిచెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+