అయోధ్యలో ధ్వజారోహణ వేడుక, ప్రధానికి అరుదైన అవకాశం - 191 అడుగుల జెండా ..!!

అయోధ్య రామ మందిరంలో అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. ధర్మధ్వజ వేడుకకు సన్నాహా లు తుది దశకు చేరుకున్నాయి. పూల అలంకరణలతో అయోధ్య మెరిసిపోతోంది. మంగళవారం (నవంబరు 25న) జరగనున్న ధర్మ ధ్వజారోహణ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరిస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ఆలయం గర్భగుడిపై కాషాయ రంగులోని 191 అడుగుల ధర్మ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.

అయోధ్య రామ మందిరం మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్దమైంది. రేపు (మంగళవారం) ధర్మ ధ్వజారోహణ వేడుక జరగనుంది. ఇందు కోసం మందిర ప్రాంగణం అందంగా ముస్తాబైంది. 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరిస్తున్నారు. శ్రీరాముడు, గణేశుడి విగ్రహాలను బంతి పూలతో అలంకరించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఇంకొన్ని గంటల సమయమే మిగిలినందున పెద్దసంఖ్యలో కార్మికులతో చకచకా ఏర్పాట్లు చేయిస్తున్నారు. రామ మందిరం ప్రధాన నిర్మాణ పనులన్నీ పూర్తయిన సందర్భంగా ఆలయం గర్భగుడిపై కాషాయ రంగులోని 191 అడుగుల ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎగురవేయనున్నారు. ఈ అరుదైన అవకాశం ప్రధాని సొంతం చేసుకున్నారు. దీనిపై ఓం, సూర్యుడు, కోవిదర చెట్టు చిహ్నాలు ఉంటాయి.

pm-modi-to-visit-ayodhya-on-november-25-for-the-grand-dwajarohan-at-the-ram-mandir

అయితే, 'ఓం' అనేది ఆధ్యాత్మిక ధ్వని. 'సూర్యుడు' రాముడి సూర్యవంశ వంశానికి సూచిక. మందార, పారిజాత మొక్కలను రిషి కశ్యపుడు సంకరం చేస్తే 'కోవిదార్ చెట్టు' పుట్టింది. మేవార్ చిత్ర రామాయణంలో అయోధ్య శ్రీరాముడి జెండా పెయింటింగ్ ఉండటాన్ని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ఆయన ధృవీకరించారు.

ఇప్పుడు ఆ సమాచారం ప్రకారమే జెండాను రూపొందించి అయోధ్య రామయ్య సన్నిధిలో ఎగురవేయబోతున్నారు. ఈ వేడుక వేళ అయోధ్య రామయ్య దర్శన అనుమతి లభించదు. అయోధ్య రామయ్యను గర్భగుడిలో ప్రతిష్ఠించి నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.5 కోట్ల మందికిపైగా ఆలయాన్ని దర్శించుకున్నారు. ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత అయోధ్యకు దేశ,విదేశాల నుంచి భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+