యూపీ మహిళలు గత ప్రభుత్వాలను కోరుకోవడం లేదు: మోడీ, రూ. 1000 కోట్లు ఎస్‌హచ్‌జీలకు బదిలీ

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా లోకం గత ప్రభుత్వాలను మళ్లీ కోరుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మహిళల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ సుమారు 16 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్లను తాజాగా, బదిలీ చేశారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రయాగ్‌రాజ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశమయ్యారు.

ప్రయాగ్‌రాజ్‌లోని 16 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆన్‌లైన్‌లో 1,000 కోట్లను బదిలీ చేశారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఈ మొత్తం బదిలీ చేశారు. దీని ప్రకారం ఒక్కో స్వయం సహాయక బృందానికి రూ.1.1 లక్షల చొప్పున 80 వేల గ్రూపులు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్) పొందుతుండగా, ఒక్కో స్వయం సహాయక బృందానికి రూ.15 వేల చొప్పున 60 వేల గ్రూపులు కార్యాచరణ నిధులు పొందుతున్నాయి. ఇది కాకుండా, 202 టెక్ హోమ్ రేషన్ ప్లాంట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

PM Modi Transfers Rs 1,000 crore to Bank Accounts of Self Help Groups, slams akhilesh yadav.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. 20 వేల బిజినెస్ క‌రెస్పాండెంట్ స‌ఖీ బీసీ స‌ఖీ ఖాతాల‌కు తొలి నెల రూ.4000 గౌర‌వ వేత‌నం కూడా బ‌దిలీ చేశారు. బిజినెస్ కరస్పాండెంట్ ఇంటింటికీ ఆర్థిక సేవలను అందిస్తారు. పర్మినెంట్ గా పనిచేసేందుకు వీలుగా వారికి 6 నెలల పాటు రూ.4000 గౌరవ వేతనం ఇస్తున్నారు. పని పెరిగిన తర్వాత, వారు లావాదేవీలో ఉన్నప్పుడు కమీషన్ నుంచి సాధారణ ఆదాయాన్ని పొందడం ప్రారంభించారు.

ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా, ముఖ్యమంత్రి కన్యా సుమంగళ్ యోజన కింద లక్ష మందికి పైగా లబ్ధిదారులకు రూ. 20 కోట్లకు పైగా నగదు బదిలీ కూడా ప్రారంభించారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టిన సందర్భంగా రెండు వేల రూపాయలు, ఒక సంవత్సరం తర్వాత అవసరమైన అన్ని టీకాలు వేసిన తర్వాత వెయ్యి రూపాయలు, ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత 2000 రూపాయలు వంటి వివిధ దశల్లో నగదు నగదు బదిలీ చేయబడుతుంది. 6వ తరగతిలో ప్రవేశానికి 2 వేల రూపాయలు, 9వ తరగతిలో ప్రవేశానికి 3,000 రూపాయలు, ఏదైనా డిగ్రీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి 5000 రూపాయలు బదిలీ చేయడం జరుగుతుంది.

మహిళా సంఘాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. గతేడాది కుంభంలో పుణ్యభూమికి వచ్చామని, సంగమంలో స్నానం చేయడం వల్ల అతీంద్రియ ఆనందం కలిగిందని అన్నారు. మా మాతృశక్తికి ప్రతీక అయిన ఈ పుణ్యనగరం గంగామాత, యమున, సరస్వతి సంగమంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి స్త్రీలు రావడం తమ అదృష్టమన్నారు. ఇప్పుడు మునుపటి ప్రభుత్వాల(ఎస్పీ, కాంగ్రెస్) యుగం రావాలని మహిళలు కోరుకోవడం లేదని ప్రధాని మోడీ అన్నారు. యూపీ మహిళలకు యోగి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అపూర్వమని కొనియాడారు.

యూపీలో మహిళల అభివృద్ధికి సీఎం యోగి చేస్తున్న కృషిని దేశం మొత్తం చూస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో లక్షలాది మంది మహిళల ఖాతాలకు కోట్లాది రూపాయలను బదిలీ చేసే భాగ్యం ఈరోజు లభించిందన్నారు. యూపీలో ప్రారంభించిన బ్యాంక్ సఖీ ప్రచారం మహిళల జీవితాల్లోనూ పెనుమార్పులు తీసుకొస్తోందన్నారు. యువతుల పెళ్లి వయస్సును 21కి పెంచడాన్ని మోడీ సమర్థించారు. మహిళల చదువు ప్రాధాన్యతను గుర్తించే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. అయితే, ఈ నిర్ణయం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతోపాటు కొన్ని పార్టీలకు నచ్చడం లేదని మోడీ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+