మోదీ అమెరికా-ఈజిప్ట్ పర్యటన: 10 కీలక విషయాలు

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించ తలపెట్టిన రెండు దేశాల పర్యటన గడువు సమీపిస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతరం ఈజిప్ట్‌కు బయలుదేరి వెళ్తారాయన. సుదీర్ఘ విరామం తరువాత భారత ప్రధాని తమ దేశ పర్యటనకు రాబోతోండటంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అమెరికా సన్నద్ధమౌతోంది.

21వ తేదీన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. 180 దేశాల ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. అక్కడ ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తోన్నారు.

 PM Modi

మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఈ విందు ఏర్పాటు కానుంది. అదే రోజు అటు అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

తన పర్యటన సందర్భంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ కానున్నారు. 23వ తేదీన రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డయాస్పోర రిసెప్షన్‌లో మోదీ పాల్గొంటారు. దీనికి భారత సంతతికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు హాజరు కానున్నారు.

దీనికి సంబంధించిన 10 విషయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ తలపెట్టిన అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు చారిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. పలు కీలక రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోనున్నామని వివరించారు.

 PM Modi

1. జూన్ 21-23 మధ్య అమెరికా, 24-25 మధ్య ఈజిప్టులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
2. ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్‌ నుంచి ప్రారంభమవుతుంది, అక్కడ జూన్ 21వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు.
3. జూన్ 22వ తేదీన వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్తారు. వైట్ హౌస్‌లో జో బైడెన్‌తో సమావేశమౌతారు. బైడెన్- అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
4. జూన్ 22వ తేదీన అమెరికా జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
5. జూన్ 23వ తేదీన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో లంచ్ భేటీలో పాల్గొంటారు.

6. వివిధ మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో మోదీ భేటీ అవుతారు.
7. అమెరికా పర్యటనను ముగించుకుని ఈజిప్ట్‌కు బయలుదేరి వెళ్తారు.
8. ఈజిప్ట్ పర్యటన సందర్భంగా ప్రఖ్యాత అల్ హకీమీ మసీదును సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. బోహ్రా కమ్యూనిటీ ఈ మసీదును పునరుద్ధరించింది.
9. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరైన విషయం తెలిసిందే.
10. ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని ఈజిప్టు పర్యటన తలపెట్టారు. ప్రధానిగా మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+