అమెరికాలో మోదీ మేనియా , బైడెన్ ప్రత్యేకంగా - యోగా సెషన్..!!

అమెరికాలో మోదీ మేనియా మొదలైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ప్రపంచం చూపు అటు వైపే ఉంది. ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా మోదీని 'స్టేట్ విజిట్‌'కు ఆహ్వానించారు. దీంతో ఈ పర్యటన రెండు దేశాలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- జిల్‌ బైడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అధ్యక్షుడే స్వయంగా తమ దేశ పర్యటనకు ఆహ్వానం పంపడంతో.. ఈ స్టేట్ విజిట్‌ను రెండు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిప్లమేటిక్‌ ప్రోటోకాల్ ప్రకారం.. స్టేట్‌ విజిట్‌ను హయెస్ట్‌ ర్యాంక్డ్‌ విజిట్‌గా గుర్తిస్తారు. ప్రధాని ఈ విజిట్ కు ప్రత్యేకతతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ పర్యటన వైపే చూస్తున్నాయి. జూన్ 22న జరిగే స్టేట్ డిన్నర్‌లో బైడెన్ దంపతులు మోదీకి ఆతిథ్యం ఇస్తారు. జూన్ 22న కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో భారత ప్రధాని ప్రసంగించనున్నారు. జూన్ 23న రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ప్రవాస నేతల సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు.

PM Modi visiting the US from June 21-24, includes an address to the Joint Session of the Congress on 22

జూన్ 23న రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ప్రవాస నేతల సమావేశంలో మోదీ మాట్లాడతారు. కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు అన్ని ఇప్పటికే ఫుల్ అయ్యాయి. గతంలోనూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో వచ్చిన స్పందన కంటే ఈ సారి ఎక్కువగా రెస్సాన్స్ కనిపిస్తోంది. కార్ల నెంబర్ ప్లేట్ల మీద మోదీ పేరుతో అభిమానులు మరింత క్రేజ్ పెంచుతున్నారు. మోదీకి ఇండియన్ కమ్యూనిటీ కల్చరల్ ఈవెంట్స్‌తో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15 రాష్ట్రాలకు చెందిన 160 మందికి పైగా కళాకారులతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతో ప్రధాని ఎక్కువ సమయం గడపనున్నారు.

జూన్ 21న నిర్వహించనున్న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా సెషన్‌ కు హాజరు కానున్నారు.యోగా సెలబ్రేషన్స్ లో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. న్యూయార్క్ నుంచి అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌కు చేరుకుంటారు. అక్కడ ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పర్యటనలో కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+