వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

91వ పడిలోకి వాజపేయి: శుభాకాంక్షల వెల్లువ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజపేయి 91వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాజపేయి నాయకత్వ లక్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అసామాన్య నాయకత్వం అందించిన గొప్ప వ్యక్తి వాజపేయి అని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకుడు, పార్లమెంటేరియన్, మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఆయా పదవులకు వన్నె తెచ్చారని, అదే ఆయన ప్రత్యేకత అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

కాగా ప్రస్తుతం కాబూల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈరోజు సాయంత్రం సాయంత్రం ఢిల్లీకి తిరిగిరాగానే వాజపేయి నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనున్నట్టు వెల్లడించారు. పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ స్మరించుకున్నారు.

మరోవైపు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహార్ జోషి లాంటి కొందరు నేతలు వాజపేయి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

వాజపేయి సేవలకు గుర్తింపుగా, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పూర్వీకుల గ్రామం బటేశ్వర్‌కు రైల్వేశాఖ సేవలను ప్రారంభించింది. రైల్వే సహాయమంత్రి మనోజ్ సిన్హా, మానవ వనరుల శాఖ సహాయమంత్రి, ఆగ్రా ఎంపీ రామ్ శంకర్ కతేరియా బటేశ్వర్‌కు ప్రయాణికుల రవాణా రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రైలు మార్గం ఏర్పాటుకు 16 ఏళ్ల కిందట అద్వానీ శంకుస్థాపన చేశారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొన్నారు.

English summary
Prime Minister Modi, who is currently in Kabul as part of his official tour, took to Twitter and said that the Atal Bihari Vajpayee always distinguished himself in every role, be it as a party leader, parliamentarian, minister or prime minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X