ఉన్నపళంగా బీజేపీ అభ్యర్థులకు మోదీ లేఖ: ఏదో తేడా కొడుతోన్నట్టే..!!
3rd Phase Lok Sabha elections 2024: మూడో విడత లోక్‌సభ ఎన్నికల కోసం దేశ యావత్తూ సర్వ సన్నద్ధమౌతోంది. ఈ నెల 7వ తేదీన మూడవ విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 94 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతుందా రోజున.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ అదే రోజున పోలింగ్ ఉంటుంది. మొత్తం 26 సీట్లకూ ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాల ఓటర్లు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్/ఇండియా కూటమి అభ్యర్థులు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులందరికీ లేఖ రాశారు. కాంగ్రెస్/ఇండియా అలయెన్స్‌పై ఎదురుదాడికి దిగాలంటూ పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగిస్తుందనే విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు.
వారి నుంచి తొలగించే ఈ రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెడుతుందని ఓటర్లకు చెప్పాలని మోదీ కోరారు. తమ 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధిని వివరించాలని, అదే సమయంలో దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అవినీతి, కుంభకోణాల గురించి తెలియజేయాలని చెప్పారు.
माननीय प्रधानमंत्री @NarendraModi जी इन प्रेरणादायी शब्दों के लिये मैं आपका हृदय से आभार प्रकट करता हूँ।
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) April 30, 2024
पिछले 10 वर्ष आपके द्वारा किए गये कार्यों से गरीब, युवा, किसान और नारी शक्ति के जीवन में बड़ा परिवर्तन आया है। आपके इन सुझावों पर हम सब कार्यकर्ता पूरी मेहनत करेंगे। pic.twitter.com/PljxKHWJvO
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును విధిస్తుందని ప్రచారం చేయాలని మోదీ చెప్పారు. ఈ విషయంపై గతంలో కాంగ్రెస్ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌ఛార్జీ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారసత్వ పన్నును విధించితే ఇంకేమీ మిగలదని అన్నారు.
మతాల వారీగా ప్రజలను విభజించి పాలించు అనే సూత్రాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోందని, వారి మధ్య భేదభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని, దీన్ని ఓటర్లకు వివరంగా తెలియజేయాలని సూచించారు. దీన్ని అడ్డుకోవడానికి దేశం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కాలంటే, జగన్ సహా వారే కీలకం- రంగంలోకి మోదీ టీం..!! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications