పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించని మోదీ విమానం: క్లియర్ ఫ్లైట్ పాత్
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మంది కన్నుమూశారు. పలువురు పర్యాటకులు, స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం సంఘటన స్థలానికి తరలి వెళ్లింది.
ఆర్టికల్ 370 రద్దయిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి ఉదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉలిక్కిపడేలా చేసింది. తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.

పహల్గామ్ దాడికి నిరసనగా అక్కడి టాక్సీ డ్రైవర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా ఈ నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు కొనసాగాయి. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, అఖ్నూర్, కుప్వారాల్లో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు.
దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి భద్రత బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పహల్గామ్ బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పర్యాటక ప్రదేశాలు, ఇతర సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దేశ రాజధాని సైతం అప్రమత్తం అయింది.
ఈ మారణహోమం తరువాత సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హుటాహుటిన భారత్‌కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనను కుదించుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఆ వెంటనే జాతయ భద్రత సలహదారుతో సమావేశం అయ్యారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

కాగా జెడ్డా నుంచి స్వదేశానికి తిరిగి వస్తోన్న సమయంలో ప్రధాని మోదీ ప్రయాణిస్తోన్న ప్రత్యేక విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించలేదు. తన గగనతలాన్ని వినియోగించుకోవడానికి పాకిస్తాన్ అనుమతి ఇచ్చినప్పటికీ- తిరస్కరించినట్లు తెలుస్తోంది. జెడ్డాకు వెళ్లేటప్పుడు పాక్ మీదుగానే వెళ్లిందీ విమానం.
తిరిగి వస్తోన్న సమయంలో మాత్రం రెగ్యులర్ ఫ్లైట్ పాత్‌కు భిన్నంగా ప్రయాణించింది. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్ ప్రధాన సూత్రధారి అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆ దేశ గగనతలం మీదుగా భారత్‌కు చేరుకోవడానికి ప్రధాని ఇష్టపడలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫ్లైట్ పాత్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.
Two pictures indicating high tension in the India-Pak Airspace.
— Abhishek Jha (@abhishekjha157) April 23, 2025
PM Modi's plane did not enter Pakistan Airspace while returning urgently from Jeddah on Wednesday.
PM @narendramodi's plane had flown over Pakistan Airspace while traveling to Jeddah from Delhi on Tuesday morning. pic.twitter.com/EeCsGedGu9












Click it and Unblock the Notifications