టెక్ హబ్ ను ట్యాంకర్ హబ్ చేశారు. నీటి కోసం రాజకీయాలా?, ప్రజల కోసం కాదా?, మోదీ ఫైర్!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాప పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సిలికాన్ సిటీ బెంగళూరులో నీటి ఎద్దడి ఎక్కువ అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకాలం అయినా కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ సమస్యను పరిష్కరించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవ చేశారు. సీఎం పదవి కోసం, అధికారం కోసం సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఇంకా పోరు నడుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

PM Narendra Modi accused of turning the tech hub Bengaluru into a tanker hub

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి పెద్ద తప్పు చేశామని కర్ణాటక ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని, కర్ణాటకలో బీజేపీకి మద్దతు తగ్గలేదని, కాంగ్రెస్ పనితీరుతో మా మద్దతు ఇంకా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినా ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవికాలం విషయం గురించి కాంగ్రెస్ నాయకులు తేల్చలేదని, సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది కానీ సీఎం కుర్చి సమస్య, ప్రజల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, కర్ణాటకలో శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం పని చేయడంలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని, ఆ రాష్ట్రంలో బాంబు పేలుళ్లు, హత్యలు జరుగుతున్నాయని, ఆ రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంచున ఉందని మోదీ ఆరోపించారు. భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడంలో బెంగళూరు చాలా పెద్ద పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.

PM Narendra Modi accused of turning the tech hub Bengaluru into a tanker hub

బెంగళూరును ఇంతకు ముందు టెక్ హబ్‌గా పిలిచేవారని, అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టెక్ హబ్ కాస్తా ట్యాంకర్‌ హబ్‌గా మార్చారని, ఐటీ హబ్ ప్రజలు నీటి కోసం ఆరాటపడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత స్కాలర్‌షిప్‌ల సంఖ్య తగ్గించబడ్డాయి. ప్రజలను ఓట్లు అడిగడానికి వాళ్లకు ముఖంలేదని, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్ కోసం ఓట్లు అడుగుతున్నారని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని నాటకమాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+