Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సొంత ఇల్లు, కారు లేదు: నరేంద్ర మోడీ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. తనకు 3 కోట్ల 2 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో మోడీ పేర్కొన్నారు. దీంతో 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఆస్తులు డబుల్ అయినట్లు తెలుస్తోంది. 52,920 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. అయితే, తనకు సొంత భూమి, ఇల్లు, కారు లేవని మోడీ స్పష్టం చేశారు.

నరేంద్ర మోడీ (Narendra Modi)కి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షలు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23.5 లక్షలు అయ్యింది. ప్రధాని మోడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 2 ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఖాతాలో 73, 304 రూపాయల డిపాజిట్ ఉండగా, వారణాసి బ్రాంచ్‌లో ఏడు వేలు మాత్రమే ఉన్నాయి.

PM Narendra Modi Declares Assets Worth Rs 3 02 Crore Doubled Since 2014

అయితే ఎస్‌బీఐలో మోడీ పేరిట 2 కోట్ల 85 లక్షల 60వేల 338 రూపాయల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది. 2,67,750 రూపాయల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మోడీకి ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్‌డీఏ అభ్యర్థిగా మోడీ పోటీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మళ్లీ వారణాసి స్థానం నుంచే నామినేషన్‌ దాఖలు చేశారు. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో ప్రధాని మోడీ తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు.

అయితే, ఈ నామినేషన్‌ ప్రక్రియలో మోడీ పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నలుగరిలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పండిత్‌ గణేశ్వర్‌ శాస్త్రి, బైజ్ నాథ్ పటేల్, లాల్ చంద్ కుశ్వాహా, సంజయ్ సోంకర్ ఉన్నారు. కాగా, వీరిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గణేశ్వర్ శాస్త్రి ప్రముఖ జ్యోతిష్యుడు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించింది ఈయనే.

బైజ్‌నాథ్‌ పటేల్‌ విషయానికొస్తే.. వారణాసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సేవాపురి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈయన. ఓబీసీ వర్గానికి చెందిన పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. సుదీర్ఘకాలంగా జన్‌సంఘ్‌, బీజేపీ కలిసి పని చేస్తున్నారు. కుర్మీ పటేల్‌ వర్గానికి సేవాపురి, రోహానియాలో గట్టి పట్టు ఉంది. మూడో వ్యక్తి లాల్‌చంద్‌ కుశ్వాహా.. ఈయన కూడా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తే. కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సిగ్రా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల కుశ్వాహా సుదీర్ఘకాలంగా బీజేపీ కేడర్‌లో ఉన్నారు. స్థానికంగా టెక్స్‌టైల్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.

సంజయ్‌ సోంకర్‌ విషయానికొస్తే.. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయన వారణాసి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ కమ్యూనిటీలో ఈయనకు మంచి పలుకుబడి ఉంది. తమ ప్రభుత్వంలో అన్నివర్గాల వారికీ సమ ప్రాధాన్యం కల్పిస్తామనే ఉద్దేశాన్ని చాటిచెప్పేందుకే ప్రధాని ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని ప్రతిపాదకులుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనూ ప్రధానిని ఈ విధంగానే చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+