Aero India 2023: కేజీఎఫ్, కాంతార హీరోలు పవర్ స్టార్ ఫ్యామిలీకి డిన్నర్ ఇచ్చిన మోదీ, లెక్కలు వేరే ?
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖులకు విందో భోజనం ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ హీరో యష్ తో ఆ సినిమా టీమ్, కాంతార హీరో, అనీల్ కుంబ్లే, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గోన్నారు.
బెంగళూరు/హైదరాబాద్: ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో పలు దేశాలకు చెందిన విమానాల విన్యాసాలు ప్రదర్శించబడతాయి. బెంగుళూరులోని యలహంకలోని ఎయిర్ ఫోర్స్ బేస్ లో జరుగుతున్న Aero India 2023 షో భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా నిలిచింది. ఏరో ఇండియా 2023 షో ప్రారంభించక ముందు ఆదివారం రాత్రి రాజ్‌భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖులకు విందో భోజనం ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ హీరోతో ఆ సినిమా టీమ్, కాంతార హీరో, అనీల్ కుంబ్లే, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కేజీఎఫ్, కాంతార హీరోలు, పునీత్ రాజ్ కుమార్ భార్య డిన్నర్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ లెక్కలు వేరే ఉంటాయని కొందరు అంటున్నారు.

రాజ్ భవన్ లో ప్రధాని మోదీ
ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ స్వాగతం పలికారు. విమనాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విధాన సౌధ సమీపంలోని రాజ్ భవన్ కు వెళ్లారు. ఏరో ఇండియా 2023 పద్నాలుగో ఎడిషన్. మొదటి ఎయిర్ షో 1996లో ప్రారంభమైంది. రాజ్‌భవన్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను ఆదివారం రాత్రి రాజ్ భవన్ లో విందుకు ఆహ్వానించారు.

రాజ్ భవన్ లో డిన్నర్ ఇచ్చిన ప్రధాని మోదీ
సినిమా, క్రీడలు, పరిశ్రమలతో పాటు అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తులతో ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరెలోని రాజ్ భవన్ లో విందుకు ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భోజనం చేసిన ప్రముఖులు పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖుల విందు జరుగుతున్న సమయంలో రాజ్ భవన్ లోకి మీడియాతో పాటు ఎవ్వరు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.

సినిమాలు, క్రీడలతో పాటు అన్ని విషయాలపై చర్చలు ?
కన్నడ సినిమా రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అనేక ఆలోచనలు చేశారని తెలిసింది. అదే సమయంలో వారి నియోజక వర్గాల్లోని సమస్యలు, వాటి పరిష్కారాల గురించి సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారని తెలిసింది. కన్నడ సినిమా అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీతో ఇదే సమయంలో చర్చ జరిగినట్లు సమాచారం. క్రికెట్ మరియు ఇతర క్రీడలపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రంగాలకు చెందిన ప్రముఖులు చర్చించారని తెలిసింది.
కేజీఎఫ్, కాంతార సినిమాల టాపిక్
కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో పాటు, కాంతార సినిమాలు ఎంత సూపర్ డూప్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్, కాంతార సినిమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారని తెలిసింది. గత శనివారం మంగళూరు వచ్చిన కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కూడా కాంతార సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడి వెళ్లారు. భారతదేశ అసలైన సంస్కృతిని చాటిచెప్పే చిత్రం కాంతార అని అమిత్ ప్రశంసించారు. కాంతార రిషబ్ శెట్టి నటనను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మెచ్చుకున్నారు.

కేజీఎఫ్ హీరో, కాంతార హీరో, పునీత్ భార్య, అనీల్ కుంబ్లే అండ్ కో
ఆదివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్ భవన్ లో జరిగిన డిన్నర్ పార్టీకి క్రికెటర్లు అనిల్ కుంబ్లే దంతపలులు, జావగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ హాజరయ్యారని కన్నడ మీడియా తెలిసింది. స్యాండిల్ వుడ్ రంగానికి చెందిన దివంగత డాక్టర్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ రాజ్ భవన్ లో జరిగిన డిన్నర్ పార్టీకి వెళ్లారు. కేజీఎఫ్ హీరో రాకింగ్ స్టార్ యష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ కిర్గందూర్, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. వీరితో పాటు కాంతారా సినిమా హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా విందుకు హాజరై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారని సమాచారం. కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వింధుకు హాజరైనారని తెలిసింది.

దేశ వ్యాప్తంగా పాపులర్
కేజీఎఫ్ సినిమాతో స్యాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ తలరాత పూర్తిగా మారిపోయింది. యష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్, జూనియర్ ఎన్టీర్ సినిమాలతో పాటు పలు తెలుగు, తమిళ సినిమాల పనుల్లో బిజీ అయిపోయారు. ఇక కాంతార సినిమాతో స్యాండిల్ వుడ్ హీరో. డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ప్రధాని మోదీ లెక్కలు వేరే ఉంటాయి ?
ఇక పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందరికి ప్రధాని నరేంద్ర మోదీ విందు భోజనం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు రంగాలకు చెందిన వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ లెక్కలకు చాలా అర్థలు ఉంటాయని, అందుకే దేశంలో బలమైన నాయకుడు అయ్యారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications