వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కు ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యం .. సత్కారాలు ! : పంజాబ్ ఎన్నికల వేళ మోదీ మాస్టర్ ఫ్లాన్ !!

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అటు ఈసారి ఎలాగైనా పంజాబ్ లో జెండా పాతేందుకు బీజేపీ, ఆప్‌లు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. విజయం కోసం బీజేపీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం దళం దూసుకెళ్తోంది.

 సిక్కు ప్ర‌ముఖులతో భేటీ వ్యూహ‌త్మ‌కంగానే..

సిక్కు ప్ర‌ముఖులతో భేటీ వ్యూహ‌త్మ‌కంగానే..


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రముఖులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన వారికి మోదీ సాదరంగా స్వాగతించారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. బీజేపీ ప్రభుత్వం సిక్కులకు తగిన గుర్తింపునిస్తోందని ఈ సందర్భంగా వారితో ప్రధాని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో పంజాబ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే గెలుపును కాంక్షిస్తూ సిక్కు ప్రముఖులతో ఈ సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

మోదీకి కిర్ప‌న్ బ‌హుక‌ర‌ణ‌!

మోదీకి కిర్ప‌న్ బ‌హుక‌ర‌ణ‌!

ప్రధాని మోదీతో పాల్గొన్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్‌ సింగగ్‌ జీ సిచెవాల్‌, ఢిల్లీ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్‌ హర్మీత్ సింగ్‌ కల్కా,, మహంత్‌ కరంజిత్‌సింగ్‌, అమృత్‌సర్‌లోని ముఖి డేరా బాబా తారా సింగ్‌కు చెందిన సంత్ బాబా మేజర్‌ సింగ్ వా తదితర సిక్కు ప్రముఖులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీని వారు సత్కరించారు. సిక్కుల పవిత్రమైన కిర్పన్‌ను అందజేశారు . పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు చెందిన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది.

సిక్కులకు , డేరాలకు ప్రత్యేక స్థానం

సిక్కులకు , డేరాలకు ప్రత్యేక స్థానం


పంజాబ్ రాజకీయాల్లో సిక్కులకు , డేరాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నికల్లో వీరి మద్దతు అత్యంత కీలకం.. వారి మద్దతు దక్కించుకోగలిగితే ఎన్నికల్లో సులభంగా విజయం సొంత అవుతుందని రాజకీయ పార్టీల గట్టి నమ్మకం. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో సుమారు 13 గ్రామాలుండగా.. వాటిలో 9 వేలకు పైగా ఊళ్లతో డేరాలు ఉన్నాయంటే వాటి ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో వారి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

English summary
PM Modi meets with most prominet sikh personalites in delhi over punjab assembly elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X