గుజరాత్ ఎన్నికలు, నరేంద్ర మోడీ ప్రచారం, డేట్ ఫిక్స్, ప్రధానికి పోటీగా రాహుల్ గాంధీ ర్యాలీలు!

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017 ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తులు పూర్తి చేశారు. నవంబర్ 27, 29వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటించనున్నారు. ప్రధానికి పోటీగా రాహుల్ గాంధీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం డేట్ లు ఫిక్స్ చేశారు.

గుజరాత్ లోని సౌరాష్ట్ర, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో ప్రధాని ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌత్ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో డిసెంబర్ 9వ తేదీ మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో నవంబర్ 27, 29వ తేదీల్లో జరిగే పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ 8 ర్యాలీల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8 ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసగించనున్నారు.

PM Narendra Modi lead BJP poll campaign in Gujarat on November 27, 29

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ తో సహ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చిత్తిస్ ఘడ్ సీఎం రమన్ సింగ్, ఉమాభారతి తదితరులు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ప్రధాని మోడీ కంటే రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ (నవంబర్ 24, 25 శుక్ర, శనివారం) రెండు రోజుల పాటు గుజరాత్ లో ప్రచారం మొదలు పెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోర్ బందర్, ఆహ్మదాబాద్, దాహోర్, గాంధీనగర్, సనంద్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ప్రతినిధి మనీశ్ జోషి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+