ఒక్క రాష్ట్రంలో ఐదు మంది సీఎంలు, ఎలా సాధ్యం అంటే ?, మీరే ఏటీఎం కార్డులు, మోదీ ఫైర్ !
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ అంచనాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కంచుకోటలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అదే జోష్ తో కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కంచుకోట అయిన శివమొగ్గలో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.
శివమొగ్గలో ప్రధాని మోదీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో కర్ణాటకలోని ముఖ్యమంత్రులపై మోదీ ఎవ్వరూ ఊహించని సమాచారం చెప్పారు. సోమవారం సాయంత్రం శివమొగ్గలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కర్ణాటకకు సీఎం ఎవరు అని ప్రజలను ప్రశ్నింంచారు. కర్ణాటకలో సీఎం, ఫ్యూచర్ సీఎం, సూపర్ సీఎం, షాడో సీఎం, ఢిల్లీలో కలెక్షన్ సీఎం ఉన్నారని, ఇంత మంది కర్ణాటకకు సీఎంలుగా పని చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడి ప్రజలు పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసిగిపోయారని, ప్రజలు వారి రుణం తీర్చుకునేందుకు అవకాశం వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీజేపీని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. కర్ణాటక ప్రజలు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ప్రజల ఈ ఆగ్రహంతో బీజేపీ-ఎన్డీయే కూటమిలోని ఎంపీలు అన్ని స్థానాల్లో గెలుపొందడం ఖాయమని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు
దేశవ్యాప్తంగా 400కు పైగా నియోజకవర్గాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, ఎన్డీఏ విజయంలో కర్ణాటక సహకారం భారీగా ఉండాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో కమలం వికసించేలా కార్యకర్తలు చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ శివమొగ్గలో కన్నడిగులను కోరారు. అవినీతి, బుజ్జగింపు విధానాన్ని అవలంబించిన ఇండియా కూటమి ఇప్పుడు బీజేపీ దెబ్బతో నిద్రపోయే స్థితికి చేరుకుందని ప్రధాని మోదీ ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని ఎద్దేవ చేశారు.
కర్ణాటకలో యడ్యూరప్ప హాట్‌బాస్ అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబు ఇచ్చారు. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను 28 స్థానాలను బీజేపీ-ఎన్డీయే కైవసం చేసుకుంటాయని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను లూటీ చేసి జేబులు నింపుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటకను ఏటీఎంగా మార్చేసిందని, రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ ఖాళీ చేసిందని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
అభివృద్ధి, స్మార్ట్ ఇండియా అనేది బీజేపీ కోరిక. కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా లేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా మాయమాటలు చెప్పడం, పట్టుబడితే కొత్త అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేదలను మళ్లీ పేదలను చేస్తోందని, పేదల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, అభివృద్ధి చెందిన కర్ణాటక కోసం ఎన్డీఏని శక్తివంచనల లేకుండా పని చేస్తోందని మోదీ అన్నారు.

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి మించి సీట్లు గెలవాలని, అందకు ప్రజల సహకారం కావాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. నారీ శక్తికి గరిష్ట గౌరవం, గొప్ప అవకాశం ఇచ్చామని, నారీ శక్తి నాకు ఓటరుగా కనిపించడం లేదని, నారీ శక్తి దేశానికి దన్నుగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. కర్ణాటకలోని ప్రతి మూలన బీజేపీకి భారీ మద్దతు లభిస్తోందని, కువెంపు కూడా కర్ణాటకను అలాగే చూశారని, ఇండియా కూటమి నారీ శక్తిని అవమానించిందని ప్రధాని మోదీ విమర్శించారు.
మహిళా శక్తిని అవమానిస్తున్న ఇండియా కూటమికి, కాంగ్రెస్ నారీశక్తి తగిన సమాధానం చెబుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విభజించి గెలిచే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది. విభజన, కులం, మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు అనే మనస్తత్వాన్ని కొనసాగించిందని, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు దేశ విభజనపై మాట్లాడుతున్నారని, అలాంటి ఎంపీలను బర్తరఫ్ చేయకుండా వాళ్లను కాంగ్రెస్ పార్టీ వెనుక వేసుకుని వస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
దేశాన్ని విభజించాలని అని కోరుకునే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని, అలాంటి కాంగ్రెస్ నాయకులు ఇదే కర్ణాటకలో ఉన్నారని, ఇలాంటి వాళ్లకు కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన అమలుతో కర్ణాటకలో 40 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేశామని, లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తోంది. ఎస్సీ, ఎస్టీల సాధికారత ద్వారా సామాజిక న్యాయం అందించామని, అన్ని వర్గాల ప్రజల కోసం బీజేపీ కృషి చేస్తుందని, భారతదేశం అంటే నెంబర్ వన్ గా ఎదుగుతున్న దేశం అని ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, ఆ దిశగానే బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications