వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా: రాజీవ్ గాంధీ తర్వాత మోడీనే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ తన పది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నాం మయన్మార్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి మయన్మార్ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. తొలుత మయన్మార్, తర్వాత ఆస్ట్రేలియా, ఫిజీలలో ఆయన పర్యటించనున్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Had a very good meeting with President Thein Sein. We had extensive discussions covering various aspects of our bilateral relations.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/532123259207041024">November 11, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలు కీలక సదస్సుల్లో పాల్గొంటారు. 1986లో రాజీవ్ గాంధీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అలాగే దక్షిణ పసిఫిక్ ద్వీపమైన ఫిజి దేశానికి 33ఏళ్ల తర్వాత పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ.

1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఫిజి దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ ఈ పది రోజుల పర్యటనలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చర్చల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలో జీ20 సమావేశాల్లో పాల్గొన్న అనంతరం కాన్ బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

ఆస్ట్రేలియా పర్యటనపై సలహాలు, సూచనలు ఇతర ఆలోచలను మోడీ తనతో పంచుకోమని ప్రజలకు తన వెబ్ సైట్ ద్వారా షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడి ప్రవాసభారతీయులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల అమెరికాలో మోడీ పర్యటించినప్పుడు అక్కడ మాడిసన్ స్క్వేర్ ప్రాంతంలో ఆయన చేసిన ప్రసంగం చరిత్రకెక్కడం... లక్షలాది మంది దాన్ని వీక్షించడం తెలిసిందే. అదే విధంగా ఆస్ట్రేలియాలో కూడా ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకాలని అక్కడి వారు ఏర్పాటు చేస్తున్నారు.

మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ తన పది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నాం మయన్మార్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి మయన్మార్ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. తొలుత మయన్మార్, తర్వాత ఆస్ట్రేలియా, ఫిజీలలో ఆయన పర్యటించనున్నారు.

 మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలు కీలక సదస్సుల్లో పాల్గొంటారు. 1986లో రాజీవ్ గాంధీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అలాగే దక్షిణ పసిఫిక్ ద్వీపమైన ఫిజి దేశానికి 33ఏళ్ల తర్వాత పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ.

 మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఫిజి దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ ఈ పది రోజుల పర్యటనలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చర్చల్లో పాల్గొంటారు.

 మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్ పర్యటనకు వెళుతూ ఢిల్లీ విమానాశ్రయంలో అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.

 మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్ పర్యటనకు వెళుతూ ఢిల్లీ విమానాశ్రయంలో విమానం లోపలికి వెళుతున్న ప్రధాని నరేంద్రమోడీ.

 మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్‌లో ప్రధాని మోడీ

మయన్మార్ పర్యటనకు వెళుతూ ఢిల్లీ విమానాశ్రయంలో విమానం లోపలికి వెళుతున్న ప్రధాని నరేంద్రమోడీ.

English summary
Prime Minister Narendra Modi, who arrived in Nay Pyi Taw on Tuesday, held talks with Myanmarese President Thein Sein.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X