వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్లో ప్రపంచంలోనే మోడీ సెకండ్, నాకు టెంపులా.. షాకైన ప్రధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్య కోటికి పైగా ఉంది. 2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ఆయన సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంటారు. ట్విట్టర్లో ఉన్న రాజకీయ నాయకులందరిలో ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రథమ స్థానంలో ఉన్నారు.

ఆయన తర్వాత స్థానం ప్రధాని మోడీదే. రాజకీయ నాయకులు కాకుండా.. ప్రపంచ నాయకుల విషయానికి వస్తే ఒబామా, పోప్‌ల తర్వాత మోడీయే ఉన్నారు. దీని పైన ట్విట్టర్ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ మిర్రర్ ఉపయోగించిన మొదటి ప్రధాని మోడీ అని దానిలో తెలిపింది. వీడియో ట్వీట్ పెట్టిన మొదటి రాజకీయ నాయకుడు కూడా ఆయనేనని తెలిపింది.

PM Narendra Modi Now has Over 10 Million Followers on Twitter

తనకు గుడి పట్ల మోడీ షాక్

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో తనకు గుడి నిర్మించారనే వార్తల పైన ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. తన పేరుతో ఆలయ నిర్మాణం సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు గుడికట్టడమా, ఇది షాకింగ్ అన్నారు. కాగా, నరేంద్ర మోడీ ఆగ్రహం నేపథ్యంలో గుడి ప్రారంభోత్సవాన్ని ఆపారు.

కాగా, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు గుడి కట్టారు. ఈ గుడిని చూసేందుకు పక్క గ్రామాలకు చెందిన వారు కూడా తరలి వస్తున్నారు. ఈ గుడిని కట్టేందుకు రెండేళ్లు సమయం పట్టిందని తెలుస్తోంది. ఈ గుడిలో తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోగ్రాఫ్ పెట్టారు.

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అనంతరం ఈ గుడికి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ గుడి కోసం రమేష్ ఉన్హద్ అనే అభిమాని డబ్బులు ఇచ్చారు. ప్రధాని మోడీ విగ్రహం తయారు చేసేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టినట్లుగా తెలుస్తోంది.

ఈ విగ్రహం ఖరీదు రూ.1.65 లక్షలు. మోడీ విగ్రహం తయారీకు తాము పలువురిని సంప్రదించామని, చాలామంది అచ్చం మోడీలా తయారు చేయలేకపోయారని, అనంతరం తాము ఒడిశా నుండి ఓ చిత్రకారుడిని పిలిపించామని, అతను మోడీలా ఉండే ప్రతిమ తయారు చేశారని రమేష్ ఉన్హద్ చెప్పారు.

మోడీ అభిమానులు అతనిని మరో సర్ధార్ వల్లభాయ్ పటేల్‌లా భావిస్తారని చెప్పారు. ఆ గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కూడా ఇలా మోడీ విగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ మోడీ గుడిలో ప్రతి ఉదయం ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలకు గ్రామస్తులతో పాటు పక్క ఊరి వారు కూడా తరుచూ వస్తుంటారు. కాగా, ఈ గుడిని అధికారికంగా ఈ నెల 15వ తేదీన మంత్రి మోహన్ బాయి కల్యాణ్‌జీబాయి కుందారియా ప్రారంభించనున్నారు.

English summary
Prime Minister Narendra Modi has crossed the 10 million mark in terms of number of followers on the popular social media platform Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X