వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీ సలహాదారు అమర్జీత్ సిన్హా రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి తాజాగా రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహారాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.

బీహార్ క్యాడర్‌కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు. అయితే, పదవీ కాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

PM Narendra Modis advisor Amarjeet Sinha resigns.

కాగా, గతంలో పీఎంవో ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేసిన మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు పీకే సిన్హా తెలిపారు. కాగా, ఈ క్రమంలోనే అమర్జీత్ సిన్హా కూడా రాజీనామా చేయడం చర్చకు దారితీసింది అయితే,. అమర్జీత్ తన రాజీనామాకు కారణాలను మాత్రం వెల్లడించలేదు.

ఇది ఇలావుండగా, డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయడంలో భాగంగా ఇ-రూపీ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో ఇ-రూపీ కీలక పాత్ర పోషించనుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు.

Recommended Video

Spl Report on YSR TP Parliamentary Committee Statement

లబ్ధిదారులకు పాదర్శకంగా నగదు చేరేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు.
నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.

English summary
PM Narendra Modi's advisor Amarjeet Sinha resigns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X