వారిని వదిలేది లేదు, వెంటాడుతాం - ఢిల్లీ పేలుడుపై ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు పై ప్రధాని మోదీ స్పందించారు. ఘటన పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పేలుడు వెనుక ఉన్న కుట్ర దారులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఘటన పైన విచారణ జరుగుతోందని.. మూలాలు గుర్తించి కారకులను వెంటాడుతామని ప్రధాని హెచ్చరిం చారు. కుట్ర దారులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తిస్తామని వెల్లడించారు.
ఢిల్లీ బాంబు పేలుడు పైన ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనతో తన గుండె కలిచి వేసిందని చెప్పారు. భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధాని ఈ అంశం పైన తొలి సారి స్పందిం చారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. దేశంలోని పలు సంస్థలు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది.

ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పేలుడు కోసం వినియోగించిన కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తించారు. కారులో ఉన్నది డా.ఉమర్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు. డా.ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి .. అని.. శ్రీనగర్‌లోని MD మెడిసిన్స్ కాలేజీ, GMC అనంతనాగ్‌లో పనిచేసినట్లు పేర్కొంటున్నారు. ఈ పేలుళ్లతో దేశ వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాత్రి నుంచే భద్రతను పెంచారు.
CISFతోపాటు.. సీఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉగ్ర మూలాలు ఉన్నాయనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. రేపు కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఈ పేలుళ్ల పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications