కాశ్మీర్ వరద బాధితులతో దీపావళి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దీపావళి పండగ రోజు కాశ్మీర్‌లో పర్యటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పండగ రోజు కాశ్మీర్‌లోని వరద బాధితులతో గడుపుతానని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా జమ్మూకాశ్మీర్ అతలాకుతలమైంది. బాధితులకు అండగా ఉండేందుకు మోడీ దీపావళి పండుగను కాశ్మీర్‌లో
జరుపుకోవాలని నిర్ణయించారు.

‘వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సోదరసోదరీమణులతో ఈ దీపావళిని జరుపుకోవాలని నిర్ణయించుకున్నా' అని మోడీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా, ప్రధాని నిర్ణయంపై కాశ్మీర్ వరద బాధితులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండగ సందర్భంగా గురువారం కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. జమ్మూకాశ్మీర్ వరదలు వచ్చాక ప్రధానమంత్రి మోడీ ఇక్కడ పర్యటించడం ఇది నాలుగో సారి.

<blockquote class="twitter-tweet blockquote" lang="en-gb"><p>Will be in Srinagar on Diwali, 23rd October & will spend the day with our sisters & brothers affected by the unfortunate floods.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/524467631592439808">October 21, 2014</a></blockquote><script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

నర్సుకు లేఖ రాసిన అరుణ్ జైట్లీ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(61) ఇటీవల అనారోగ్యానికి గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అక్కడ తనకు సేవలందించిన ఓ నర్సుకు ఆయన తాజాగా ఓ లేఖ రాశారు. ఆస్పత్రిలో తనకు ఆమె అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. సమర్థవంతంగా, ప్రొఫెషనల్ తరహాలో ఆమె తన పట్ల వ్యవహరించడాన్ని గొప్పగా భావిస్తున్నానని లేఖ పేర్కొన్నారు.

PM Narendra Modi to Spend Diwali in Flood-Hit Srinagar

అరుణ్ జైట్లీ ఇటీవలే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడ నెలరోజులపాటు చికిత్స పొందిన అనంతరం, ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన ఎయిమ్స్‌లో చేరారు. అక్కడే ఆ నర్సు ఆయనకు సేవలందించారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ ఆమె అందించిన సేవలను కొనియాడుతూ లేఖ రాశారు. ఇటీవలే కోలుకున్న అరుణ్ జైట్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+