నేడు బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రికి అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: క్యాన్సర్ వ్యాదితో కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో బీజేపీ నాయకులు విషాదంలో మునిగిపోయారు. అనంతకుమార్ అంతిమదర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు.
Recommended Video

బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని నేషనల్ కాలేజ్ మైదానంలో ప్రజల అంతిమ దర్శనం కోసం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ పార్థీవదేహాన్ని తరలించారు. నేషనల్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లను బీజేపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అంతిమ దర్శనానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ప్రధాని కార్యాలయ వర్గాలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం నుంచి అనేక సార్లు ఎంపీగా విజయం సాధించిన కేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రతినిత్యం ప్రజలు, కార్యకర్తలను చిరునవ్వుతో పలకరించేవారు. అనంత్ కుమార్ అంతిమదర్శనం కోసం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు బయలుదేరారు.












Click it and Unblock the Notifications