వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలింపిక్స్‌పై ప్రధాని మోదీ కీలక రివ్యూ -టోక్యో వెళ్లే అందరికీ కచ్చితంగా టీకాలు

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం నుంచి భూగోళం ఇంకా తేరుకోకముందే విశ్వక్రీడలకు రంగం సిద్ధమైంది. జపాన్‌ వేదికగా మరి కొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కూడా సమాయత్తమవుతున్నది. ఒలింపిక్ క్రీడలకు సంబంధించి ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించారు.

వైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటనవైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటన

విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రధాని మోదీ సమీక్షించారు. జపాన్‌కు పయనమయ్యే భారత బృందంతో జులైలో సమావేశమవుతానని పీఎం పేర్కొన్నారు. ఒలింపిక్స్ కోసం జపాన్‌కు వెళ్లేవారందరూ కచ్చితంగా కరోనా టీకా వేసుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు. ఒలింపిక్ సన్నద్ధతపై ప్రధానమంత్రి స్థాయిలో రివ్యూ జరగడం దాదాపు ఇదే తొలిసారి.

PM Stresses On Vaccination For All Travelling To Tokyo At Olympics Review Meet

''ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జపాన్ వెళుతున్న భారత్ బృందంతో నేను జులైలో సమావేశం అవుతాను. దేశం వారిని చూసి గర్విస్తోంది. 135 కోట్ల ప్రజల ఆశలన్నీ ఈ యువ క్రీడాకారులపైనే ఉన్నాయి. వీరు దేశంలో క్రీడలకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక సంస్కృతిని సృష్టించారు.'' అని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై మెరిసే ప్రతి క్రీడాకారుడి కారణంగా దేశంలో మరో వేయి మంది యువత క్రీడలవైపు మళ్లుతారని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ సడన్ సర్‌ప్రైజ్ -చాలా ఆనందించారు కదా -సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై విద్యార్థులతో ముచ్చటప్రధాని మోదీ సడన్ సర్‌ప్రైజ్ -చాలా ఆనందించారు కదా -సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై విద్యార్థులతో ముచ్చట

Recommended Video

Biological-E's Covid Vaccine తో రూ. 1500 కోట్ల డీల్ | 30 Crore Doses | Hyderabad || Oneindai Telugu

ఒలింపిక్స్ కోసం దేశంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులు ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. క్రీడాకారులు, వారి సహాయకులు, ఒలింపిక్స్‌కు వెళ్లే భారత అధికారులకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ప్రధాని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. టీకాల నుంచి శిక్షణ ఏర్పాట్ల వరకూ క్రీడాకారుల ప్రతి అవసరానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఒలింపిక్స్ సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు వీలుగా వారు ప్రతిరోజు తమ స్నేహితులతో, కుటుంబసభ్యులతో వీడియో కాన్ఫరెన్సీంగ్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తామని అధికారులు మోదీకి వివరించారు.

English summary
With the Tokyo Olympics less than two months away, Prime Minister Narendra Modi today reviewed preps for the mega sports event being held for the first time in the shadow of the coronavirus pandemic. The Prime Minister said he would connect with the Indian contingent in July and stressed that everyone travelling to Japan must be vaccinated. "I will be connecting with our Olympics contingent through a video conference in July, to encourage them and assure them that a proud nation stands with them," PM Modi said in the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X