అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆ ప్రభావం ప్రపంచదేశాలతో పాటుగా భారత్ పై పడుతోంది. ఈ మేరకు భారత్ లో ఇంధన కొరత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మార్చి 27న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. మరోవైపు రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. నాలుగు వారాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు సంధి చర్చలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దాంతో ఇరాన్- అమెరికా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం ఇప్పుడు ప్రపంచదేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం భారత్ పైనా పడుతోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (LPG) సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చమురు సరఫాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మార్చి 27 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. యుద్ధం కారణంగా భారత్ లో గ్యాస్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications