జ్యూస్ లో విషం కలిపి వడ్డీ వ్యాపారి హత్యకు ప్లాన్, ఏడాది ముందు ఆవ్యాపారితో ఏం జరిగిందంటే?

ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న అతను పంటల్లో లాభాలు వచ్చిన తరువాత తెలిసిన వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచ్చి నెలనెల వడ్డీ వసూలు చేస్తున్నాడు. వ్యవసాయం, వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి ఆ వడ్డీ వ్యాపారికి జ్యూస్ లో విషం కలిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

కర్ణాటకలోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురం తాలుకాలోని ఆచంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గోపాలప్ప అనే వ్యక్తికి విషం కలిపిన జ్యూస్ ఇచ్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆయన ఆస్పత్రిలో చేరాడు. కొళత్తూరు గ్రామానికి చెందిన శివన్నకు గోపాలప్ప గత ఏడాది లక్షలు లక్షలు అప్పుగా ఇచ్చాడు. నిందితుడు శివన్న చాలా సంవత్సరాల నుంచి మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Poison was added to the juice to kill the moneylender in Karnataka

తాను వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు కావాలని శివన్న గత ఏడాది గోపాలకృష్ణను అప్పు అడిగాడు. గోపాలప్ప శివన్నకు వ్యాపారం చేసేందుకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. గోపాలప్ప దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్న తరువాత మాంసం దుకాణం యజమాని శివన్న అతని బుద్ది చూపించాడని తెలిసింది. తీసుకున్న రుణంతో పాటు వడ్డీ కూడా తిరిగి ఇవ్వడంలో జాప్యం చూస్తున్న శివన్న కాలం గడిపేశాడని తెలిసింది.

దీంతో గోపాలప్ప తీసుకున్న అప్పు తిరిగి అడగడానికి శివన్న కోసం యాళ్లూరు గ్రామానికి వచ్చాడు.అప్పు ఇచ్చేందుకు కొంత సమయం ఇవ్వాలని శివన్న కోరాడు. తరువాత శివన్న అతడి ద్విచక్ర వాహనంపై గోపాలప్పను పిలుచుకుని వెళ్లి బస్ స్టేషన్ వద్ద దింపాడు. బస్టాప్ దగ్గర గోపాలప్పకి శివన్న స్వయంగా జ్యూస్ ప్యాకెట్ ఇచ్చాడు. జ్యూస్ తాగిన వెంటనే గోపాలప్పకు నోటిలో మంట ఎక్కువ అయ్యి, గుండెల్లో మంట మొదలైంది.

అక్కడే గోపాలప్ప కూప్పకూలిపోయాడని తెలిసింది. వెంటనే జ్యూస్ పాకెట్ తో పాటు గోపాలప్పను శ్రీనివాస్ పురంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తన దగ్గర అప్పు తీసుకున్న శివన్న జ్యూస్ లో విషం కలిపి తనకు ఇచ్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని వడ్డీ వ్యాపారి గోపాలప్ప ఆరోపించారు. పోలీసులు జ్యూస్ ప్యాకెట్ ను స్వాధీనం చేసుకుని దానిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు.

జ్యూస్ పాకెట్‌లో విషం కలిపారా? లేదా జ్యూస్ పాకెట్ విషపూరితమైందా అని విచారణ జరిపితే బయటపడుతుందని పోలీసులు అంటున్నారు.. ఈ ఘటన శ్రీనివాసపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అయితే వడ్డీ వ్యాపారి గోపాలప్పకు జ్యూస్ ప్యాకెట్ ఇచ్చిన శివన్న మాయం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు అంటున్నారు. వడ్డీ వ్యాపారిని హత్య చెయ్యడానికి జ్యూస్ లో విషం కలపడం కర్ణాటకలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+