డిగ్గీతో అమృత ఫోటోలపై పోలీసులు, తప్పేంటని అమర్

లక్నో/భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ దిగ్విజయ్ సింగ్, టీవీ యాంకర్ అమృతా రాయ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను తొలగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులు శుక్రవారం వివిధ సామాజిక సంబంధాల వెబ్‌సైట్లకు ఆదేశాలు జారీ చేశారు. తన ఈ-మెయిల్‌ను హ్యాక్ చేయడమేకాకుండా, దిగ్విజయ్ సింగ్‌తో ఉన్న వ్యక్తిగత ఫొటోలను లీక్ చేశారంటూ అమృత చేసిన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఐటి చట్టం 66(ఏ), ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తన పేరు మీద ట్విటర్, ఫేస్‌బుక్ సైట్లలో నకిలీ ఖాతాలను సృష్టించి అసహ్యకర పోస్టులు పెడుతున్నారని, వాటిలోనూ ఈ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారని అమృత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Police ask websites to remove private pics of Amrita Rai, Digvijay

తన మెయిల్‌ను హ్యాక్ చేయడం, అందులోని వివరాలను బహిరంగ పరచడం ఖచ్చితంగా తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అమృత తాజాగా ట్వీట్ చేశారు.

తప్పేముంది: అమర్ సింగ్

దిగ్విజయ్ సింగ్ చేసిన దాంట్లో తప్పేముందని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. గర్ల్ ఫ్రెండ్ పైన అనవసర రాద్ధాంతం సరికాదన్నారు. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. సహజీవనాలు తప్పు కాని దేశంలో ఇది తప్పంటే ఎలా అని ప్రశ్నించారు. దిగ్విజయ్‌ను అమర్ సింగ్ వెనుకేసుకు రావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+