wife husband police family sons constable hanging house sp life delhi affair bedroom bathroom భార్య భర్త పోలీసు ఫ్యామిలీ కొడుకులు ఉరి ఇల్లు ఎస్పీ జీవితం ఢిల్లీ సంబంధం
Wife: పోలీసు భార్య ఆత్మహత్య, బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు, ఏం జరిగిందో ?, నాకు తెలీదు !
బెంగళూరు: భర్త పోలీసు, భార్య ఇంట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది. ఏం జరిగిందో ఏమో, పోలీసు కానిస్టేబుల్ భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులను చంపేయడానికి ప్రయత్నించింది. పిల్లలు చనిపోయారని పొరపాటుపడిన పోలీసు భార్య తరువాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య ఆత్మహత్య చేసుకునే సమయంలో తాను బయట ఉన్నానని, తనకు ఏమీ తెలీదని ఆ పోలీసు అంటున్నాడు. అయితే అసలు కథ ఏమిటి ? అనే విషయం ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
Wife: ఎవడేవాడు ?, ఇంత రాత్రి నీకు ఏం పని ?, రోడ్లో భార్యను బీర్ బాటితో పొడిచి చంపిన భర్త!

మొగుడు కానిస్టేబుల్
దక్షిణ పశ్చిమ ఢిల్లీలోని గిటోరి విలేజ్ లో సుశీల్ అనే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు. కానిస్టేబుల్ సుశీల్ కు భార్య రాజషి, సమ్రత్ (3), ష్రీత్ (మూడు నెలలు) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుశీల్ ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సుశీల్ భార్య రాజషి ఇంటి దగ్గరకే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది.

ఏం జరిగిందో ? ఏమో
కానిస్టేబుల్ సుశీల్ ఇంట్లో ఏం జరిగిందో ఏమో ? తెలీదు కాని అతని భార్య రాజషి జీవితంపై విరక్తి పెంచుకునింది. మూడు నెలల కొడుకుతో పాటు మూడేళ్ల కొడుకును బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన రాజషి వారి గొంతులు నులిమి హత్య చెయ్యడానికి ప్రయత్నించింది. కొడుకులు చనిపోయారని పొరపడిన రాజషి తరువాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది.

తలుపులు లాక్ ?
ఇంటికి వెళ్లిన భర్త సుశీల్ తలుపులు తియ్యాలని భార్య రాజషికి చెప్పినా ఎలాంటి స్పందనలేకపోవడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరు పిల్లలు బాత్ రూమ్ లో స్పృహ తప్పిపడిఉన్న ఇద్దరు పిల్లలను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు.

నాకు ఏమీ తెలీదు సార్
మూడు నెలల చిన్నారి పరస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి ప్రతాప్ సింగ్ మీడియాకు చెప్పారు. ఆసుపత్రికి తరలించే సమయానికి కానిస్టేబుల్ సుశీల్ భార్య రాజషి ప్రాణాలు పోయాయని పోలీసు అధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. ఇద్దరు పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని రాజషి ఎందుకు డిసైడ్ అయ్యింది ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారి ప్రతాప్ సింగ్ మీడియాకు చెప్పారు.