కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?
కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న లిక్కర్ షాపులను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రాలు కూడా లిక్కర్ షాపులకు బార్లా తెరిచాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. అయితే మహిళ నేతలనీ కూడా చూడకుండా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నో ఫిజికల్ డిస్టన్స్..
మద్యం షాపులు తెరవడంతో జనాలు గుమిగూడతారనే ఆందోళన నెలకొంది. భౌతిక దూరం అనే మాటను మందుబాబులు మరచిపోయారనే చెప్పాలి. దీంతో మధురైలో వైన్ షాపుల ముందు ఫిజికల్ డిస్టన్స్ పాటించని వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. తర్వాత వైన్ షాపు ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం మహిళా నేతలు 100 మంది వరకు ఆందోళన చేపట్టారు. వారిపై కూడా పోలీసులు లాఠీలు ఝులిపించారు.

వాగ్వివాదం..
అంతకుముందు సీపీఎం మహిళా నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని నేతలు కామెంట్ చేశారు. మాట మాట పెరగడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వాస్తవానికి మధురైలో మద్యం విక్రయాలు కూడా ఎక్కువే జరిగాయి. మొదటిరోజు మధురైలో 46.78 కోట్ల మద్యం విక్రయాలు జరుగడం విశేషం. దీంతో అక్కడ ఫిజికల్ డిస్టన్స్ పాటించరని.. వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి.
Recommended Video

నిరసన సెగ
ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రభుత్వం అందజేస్తోన్న ఉచిత బియ్యాన్ని మహిళలు పోలీసులపై విసిరి తమ ఆందోళనను తెలియజేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులను తెరవడాన్ని డీఎంకే, విదుతలై చిరుతైగల్ కచ్చి, సీపీఎం, మక్కల్ నీది మ్యం పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మధురైలో ఉల్లంఘనలు జరిగాయి. జల్లికట్టు ఎద్దుల అంత్యక్రియల సందర్భంగా వందలాది మంది గుమికూడిన సంగతి తెలిసిందే. పండగ సందర్భంగా ఆలయం వద్ద కూడా భౌతిక దూరం పాటించాలనే విషయాన్ని ప్రజలు మరచిపోయారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications