చెన్నైలో సీఏఏ నిరసనలు, లాఠీచార్జీ చేసిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. చెన్నెలోని వాషర్‌మెన్‌పేటలో నిరసన చేపట్టారు. సీఏఏతోపాటు జాతీయ పౌరసత్వ రిజిష్టర్, ఎన్‌పీఆర్‌కి వ్యతిరేకంగా యువత కదం తొక్కారు. అయితే ఆందోళన చేసే చోటకు పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసులు అనడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో సిచుయేషన్ మరింత చేయిదాటిపోయింది.

 Police lathicharge protesters demonstrating against CAA..

అక్కడినుంచి ఆందోళనకారులు వెళ్లకపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు శుక్రవారం అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. వాషర్ మెట్‌పేట్ వద్ద ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పోలీసులు తెలిపారు.

సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 11 మంది వరకు చనిపోయారు. ఢిల్లీ, బెంగళూరులోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రస్తుతం ఆందోళనలు చెన్నైకి చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+