ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఫస్ట్ టైమ్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో శుక్రవారం మొదటి విడత పోలింగ్ జరగనుంది. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా బెంగళూరులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బెంగళూరు సిటీలోని లోక్ సభ నియోజక వర్గాలతో పాటు బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో కూడా శుక్రవారం పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా బెంగళూరు నగరంతో సహ బెంగళూరు గ్రామీణ జిల్లాల సరిహద్దులో ప్రత్యేకంగా పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలోని ప్రతి ఏరియలో పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నాకాబంధీ నిర్వహిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా బెంగళూరు నగరంలోని ఐటీ, బీటీ కంపెనీలతో సహ కార్పోరేట్ కంపెనీలు, ఎంఎన్ సీ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ కంపెనీల ఉద్యోగులు శుక్రవారం ఓటు వేసేందుకు వేతనంతో కూడుకున్న జీతం ఇవ్వాలని, అందరికి సెలవు ప్రకటించాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు సెలవు ప్రకటించారు.
బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్బంగా బీఎంటీసీ, బెంగళూరు మెట్రో ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తున్నాయి. బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటూ వేరే ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న ప్రజలు సరైన సమయంలో వెళ్లి ఓటు వెయ్యడానికి అన్ని సదుపాయాలు కల్పించారు.
గత లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్ శాంతం ఉంటుందని అధికారులు అంచానా వేస్తున్నారు. అయితే ఐటీ హబ్ బెంగళూరులో వీకెండ్ ముందు రోజు గురువారం పోలింగ్ తేది ఉండటంతో చాలా మంది గురువారమే బెంగళూరు వదిలేసి వారి సొంత ప్రాంతాలకు భార్య, పిల్లలతో వెళ్లిపోయారని తెలిసింది. మొత్తం మీద శుక్రవారం బెంగళూరులో ఎంత శాతం పోలింగ్ జరుగుతుందో వేచి చూడాలని సామాన్యులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా బెంగళూరు నగరంతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications