దారుణం: ఉద్యోగాల పేరిట బలవంతపు వ్యభిచారం

బెంగుళూరు: నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి వ్వవభిచారం నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై ఆదివారం సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే బెంగుళూరులోని మైసూరు రోడ్డులోని ఎస్‌టీ పేటెలో లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోల్‌కత్తా, మైసూరుకు చెందిన కొందరు యువతులను పోలీసులు రక్షించారు.

Police raids on prostitution centres in bangalore

ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన మంజునాథ్, మండ్య నివాసి మహేశ్, బెంగళూరుకు చెందిన రఘు, ఆశ్రీప్‌ఆలీ, తుమకూరు నివాసి ధర్మేంధ్రకుమార్, బీహార్‌కు చెందిన చాంద్‌ను ‌అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో కోల్‌కత్తాకు చెందిన నలుగురు మహిళలతో పాటు మైసూరుకు చెందిన ఒక మహిళను పోలీసులు ఈ వ్యభిచారం కూపం నుంచి రక్షించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి తమతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు ఈ దాడిలో పట్టుబడిన కోల్‌కత్తా మహిళలు మీడియా ముందు వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+