రావొద్దు: అక్బర్‌కు నోటీస్, జగన్ కేసులో నా పేరు వద్దని..

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి మహారాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రకు రావొద్దని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. ఈ నెల 23వ తేదీన మహారాష్ట్రలోనే థానేలో జరగనున్న ఓ బహిరంగ సభకు అక్బరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

అయితే, ఆ బహిరంగ సభకు హాజరు కాకుండానే థానే కమిషనర్ సోమవారం నోటీసులు పంపించారని సమాచారం. థానేలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని, అందువల్ల సభకు రావొద్దని మహారాష్ట్ర పోలీసులు అక్బరుద్దీన్‌కు పంపిన నోటీసులో తెలిపారు. మరోవైపు, అక్బరుద్దీన్ ఒవైసీకి మహారాష్ట్రలోని ఒక కోర్టు నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం.

Police sent notices to Akbaruddin

నా పేరు తొలగించండి: హెటిరో డైరెక్టర్

హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని అందులో కోరారు. లేపాక్షి ఛార్జిషీట్ లో తనపేరు తొలగించాలంటూ ఐఏఎస్ అధికారి శ్యాంబాబు సీబీఐ న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు.

లేపాక్షి వ్యవహారంలో అధికారిగా మాత్రమే తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ధారించిందని, తనపై విచారణకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి సిఫార్సు కూడా చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. త్వరలో ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+