కాలేజ్ అమ్మాయిలతో గేమ్స్ ఆడిన ఎస్, బ్రోకర్ పని చేసిన హెడ్ కానిస్టేబుల్, ఐపీఎస్ ఎంట్రీతో!
కళాశాల విద్యార్థినిపై ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలోని గదగ్ జిల్లా గజేంద్రగడ్ తాలూకాలోని నరేగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నిఖిల్ కాంబ్లే, హెడ్ కానిస్టేబుల్ శంకర్ నలాకర్ అలియాస్ శంకర్ పై ఓ విద్యార్థి తీవ్ర ఆరోపణ చేసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న గదగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గదగ్ ఎస్పీ) బీఎస్. నేమగౌడ నిందితుడు అయిన హెడ్ కానిస్టేబుల్ శంకర్ ను సస్పెండ్ చేసి ఎస్‌ఐపై విచారణకు ఆదేశించారు.
నరేగల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నిఖిల్ కాంబ్లే, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శంకర్‌లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. విద్యార్థినిపై ఎస్‌ఐ నిఖిల్ కాంబ్లే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడరని ఆరోపణలు వచ్చాయి. సాటి అమ్మాయిలతో కలిసి కాలేజీకి వెళ్లే విద్యార్థిని దగ్గర బలవంతంగా వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత మీకు డబ్బులు ఇస్తామని చెప్పి విద్యార్థినికి పదేపదే ఫోన్ చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ శంకర్ ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపి పదే పదే వేధించాడని తెలిసింది.

మీరు తనను వేధిస్తున్నారని తాను ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని బాధిత విద్యార్థిని బెదిరించినా ఎస్ఐ నిఖిల్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ శంకర్ ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. ఎస్పీకి చెబుతానని చెప్పినా వినకుండా వేధిస్తున్నట్లు పగలు రాత్రి అని తేడా లేకుండా విద్యార్థినిని వేధిస్తున్నారని పోలీసులపై విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేగల్ పోలీసుల వల్ల ప్రాణహాని ఉందని కాలేజ్ అమ్మాయిలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయితే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన ఆ కాలేజ్ అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఎస్‌ఐ నిఖిల్ కాంబ్లే స్థానిక మీడియాకు తెలిపారు. ఈ రోజు నాకు ఈ విషయం గురించి తెలిసిందని, ఈ కేసులో శంకర్ కు సంబంధం ఉందని, తనకు ఎలాంటి సంబందం లేదని ఎస్ నిఖిల్ అంటున్నారు. తన మీద ద్వేషంతో నా పేరు ఇరికిస్తున్నారని, ఇందులో నా తప్పేమీ లేదని, కాలేజ్ అమ్మాయిల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎస్‌ఐ నిఖిల్ స్పష్టం చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ శంకరన్ ను సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. గదగ్ ఎస్పీ బీఎస్ నేమగౌడను మీడియా ప్రశ్నించగా హెడ్ కానిస్టేబుల్ శంకర్ ఇప్పటికే సస్పెండ్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడు ఎస్ఐ నిఖిల్‌పై దర్యాప్తుకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తరువాత అతను తప్పు చేసినట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. కాలేజ్ అమ్మాయిని పోలీసులే వేధిస్తున్నారని ఆరోపణలు రావడంతో గదగ్ ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications