పొలిటికల్ పొంగల్: పండుగ పూట తమిళనాడుకు జాతీయ ప్రముఖులు -రాహుల్, భగవత్, నడ్డా అక్కడే
ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈసారి పొంగల్ పండుగ రాజకీయంగానూ కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది జాతీయ నేతలంతా తమిళగడ్డపై పండుగను జరుపుకొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మోహన్ రావ్ భాగవత్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఈ ముగ్గురూ తమిళనాడులోనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.
పొంగల్ పూట ముగ్గురు ప్రముఖులూ ఒకే రాష్ట్రంలో వివిధ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ గురువారం కదంబుడీ చిన్నమ్మన్ ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోపూజలో పాల్గొని, పొంగల్ ఉత్సవాలను ప్రారంభించారు. మోహన్ భాగవత్ చెన్నై పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రెండు రోజుల్లో చెన్నై ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అటు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమిళనాడులో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. నడ్డా పర్యటనలోనే అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై క్లారిటీ రానుందని, ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరగొచ్చని వినికిడి. ఇక..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పొంగల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం తర్వాత మధురై జిల్లాకు వెళ్లిన రాహుల్.. అక్కడ జల్లికట్టు పోటీలను తిలకించారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరుగనున్నాయి.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications