ఆ మూడు కవచాలను ఛేదించితేనే బీజేపీకి ఓటమి: ప్రశాంత్ కిశోర్
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలకు సూచనలు ఇచ్చారు.
పాట్నా: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ- దీనికి సన్నద్ధమౌతున్నాయి. దీనికంటే ముందు- అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్నాయి ఈ రెండూ. ఇప్పటివరకు త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి.

అసెంబ్లీ వేడి..
కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం అంత సులువేమీ కాదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయినప్పటికీ- బీజేపీని ఢీ కొట్టడం అనుకున్నంత సులభతరం కాదని పేర్కొన్నారు.

జన్ సురాజ్..
ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బిహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్న విషయం తెలిసిందే. జన్ సురాజ్ యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తోన్నారాయన. గత ఏడాది అక్టోబర్ లో ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తోన్నారు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్.. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతోన్నాయనే విషయం మీద మాట్లాడారు.

ఈ మూడే బీజేపీకి బలం..
బీజేపీ ప్రధానంగా- మూడు అంశాల మీదే ఆధారపడి ఉందని, దాన్ని ఛేదించితేనే ప్రతిపక్షాలకు విజయం దక్కుతుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. హిందుత్వ, జాతీయత, సంక్షేమం.. ఈ మూడింటిపైనే బీజేపీ మనుగడ సాగిస్తోందని వివరించారు. ఇందులో ఏ రెండింటినయినా ప్రతిపక్షాలు ఛేదించాల్సి ఉంటుందని, అప్పడే విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు.

ఏకతాటిపైకి..
హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గాంధేయవాదులు, అంబేద్కరిటీస్, సోషలిస్టులు, కమ్యూనిస్టు భావజాలం ఎంత వరకు ప్రభావం చూపుతుందనే విషయం మీదే బీజేపీ ఓటమి ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా ఏకతాటిపైకి వస్తాయా? రావా? అనేది చెప్పలేమని అన్నారు. ప్రతిపక్ష కూటమి నాయకులు ఈ మధ్యకాలంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తోన్నారని, ఎవరు ఎవరితో లంచ్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని ఎవరిని టీకి ఆహ్వానిస్తున్నారనేది సైద్ధాంతిక పొత్తులను నిర్ణయించలేదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

పార్టీల మధ్య కాదు..
బీజేపీ అనుసరిస్తోన్న హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే సిద్ధాంతాల ఆధారంగా కూటములు ఏర్పడాల్సి ఉంటుందే తప్ప- రాజకీయ పార్టీల మధ్య కాదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత- కొంత వరకు బీజేపీని నిలువరించగలదని, విభిన్న భావాలు, సిద్ధాంతాలను అనుసరిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని తాను అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. అది సాధ్యం కాదని పేర్కొన్నారు. అదే జరిగితే- బీజేపీకి ఎదురు ఉండదనీ అన్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications