Rajasthan Election: రాజస్థాన్‌లో జోరుగా పోలింగ్ : రిక్వెస్ట్ చేసిన మోదీ

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తెరచుకున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు 199 చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడం వల్ల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరణ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుర్మీత్ సింగ్ కూనర్.. కన్నుమూసిన విషయం తెలిసిందే.

 Polling begins for the Rajasthan Assembly elections 2023

మొత్తంగా 5,26,90,146 మంది రాజస్థానీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. వారి కోసం 51,890 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్.. వంటి హేమాహేమీలు పోటీలో ఉన్నారు.

రాజ్యవర్ధన్ రాథోడ్, దియా కుమారి, కిరోడిలాల్ మినా ఏడుమంది ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా రేసులో నిలిచారు. ఈ సారి వసుంధర రాజె ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ప్రకటించలేదు. ఫలితంగా ఆ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించుకోగలిగితే కొత్త ముఖ్యమంత్రి వస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి సీనియర్లు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సుడిగాలి పర్యటనలు చేపట్టారు.

ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరిగేలా చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ ఇదేనని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+