Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Polluted Countries: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్.. పాక్ ఏ స్థానంలో ఉందంటే?

Polluted Countries: ప్రపంచంలో అత్యంత కాలుష్యదేశాల జాబితా వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత దేశాలలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అత్యంత కలుషిత దేశంగా చాడ్ ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత బంగ్లాదేశ్ రెండు స్థానంలో ఉండగా.. పాకిస్థానం మూడో స్థానంలో ఉంది. అస్సాంలోని బర్నిహాట్ భారత్‌లోనే అత్యంత కాలుష్యపూరిత మెట్రోపాలిత ప్రాంతంగా నమోదైంది. ఈ సమాచారం ఐక్యూ ఎయిర్ రిపోర్టులో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 శాతం నగరాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్యసంస్థ వాయు కాలుష్య గైడ్ లైన్స్ ను పాటిస్తున్నట్లు తెలిసింది.

భారత్ లో అత్యంత కలుషితమైన ప్రాంతం బర్నిహాట్
2024లో అస్సాంలోని బర్నిహాట్ భారత్ లో అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు PM2.5 సాంద్రత 128.2 µg/m3 గా ఉంది. ప్రపంచంలోని తొమ్మిది అత్యంత కాలుష్య నగరాలకు మధ్య ఆసియా, దక్షిణాసియా ప్రాంతం నిలయంగా ఉంది. ప్రపంచంలోని 9 అత్యంత కాలుష్య నగరాల్లో 6 భారత్ లోనే ఉన్నాయి.

Polluted Countries India Among the Top 5 Most Polluted Nations Pakistan Ranks 3rd

2024లో ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాలు ఇవే..
చాడ్
బంగ్లాదేశ్
పాకిస్థాన్
కాంగో
భారత్

అత్యంత కాలుష్య నగరాలు భారత్ లోనే..
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు భారత్ లోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం అయినా, రాజధాని అయినా రెండూ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. మేఘాలయలోని బర్నిహాట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని బిరుదును ఢిల్లీ ఇప్పటికీ కలిగి ఉండడం సిగ్గుచేటు. మంగళవారం ప్రచురితమైన కొత్త రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ "వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2024" ప్రకారం, ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా మిగిలిపోయింది.2023లో మూడో స్థానంలో ఉన్న భారత్.. 2024లో ప్రపంచంలో ఐదో అత్యంత కలుషిత దేశంగా నిలిచింది.

భారత్ లో తీవ్రమైన ముప్పుగా మారిన వాయు కాలుష్యం
2024 నాటికి భారత్ లో PM2.5 స్థాయిలు 7 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. 2024లో ఇది క్యూబిక్ మీటర్ కు సగటున 50.6 మైక్రోగ్రాములుగా ఉండగా.. 2023లో ఇది క్యూబిక్ మీటర్ కు 54.4 మైక్రోగ్రాములుగా ఉంది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు స్థిరంగా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ వార్షిక సగటు PM2.5 స్థాయి క్యూబిక్ మీటర్ కు 91.6 మైక్రోగ్రాములు నమోదైంది. 2023లో క్యూబిక్ మీటర్ కు 92.7 మైక్రోగ్రాములు ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపుగా మారలేదు. వాయు కాలుష్యం భారత్ లో తీవ్ర ముప్పుగా మారింది. దీని వల్ల ఆయుర్దాయం 5.2 సంవత్సరాలు తగ్గుతోంది. గత సంవత్సరం ప్రచురించబడిన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ స్టడీ ప్రకారం.. 2009 నుంచి 2019 వరకు భారత్ లో ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మరణాలు కాలుష్యం వల్ల సంభవించినట్లు తెలుస్తోంది.

PM2.5 అంటే ఏమిటి?
PM2.5 అంటే గాలిలో ఉండే 2.5 మైక్రాన్ల కంటే సూక్ష్మ కాలుష్య కణాలను సూచిస్తుంది. ఈ కణాలు ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోని ప్రవేశించి శ్వాస సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ కు కూడా కారణమవుతాయి. వాహనాల నుంచి వచ్చే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, కలప లేదా పంట అవశేషాలను కాల్చడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.

అమెరికాలో ఎంత కాలుష్యం ఉంది?
అమెరికాలో అత్యంత కలుషితమైన ప్రధాన నగరం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ . కాలిఫోర్నియాలోని ఒంటారియో అమెరికాలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచంది. వాషింగ్టన్ లోని సియాటెల్ అమెరికాలోని అత్యంత పరిశుభ్రమైన ప్రధాన నగరంగా నిలిచింది. 2024 నాటికి ఓషియానియా ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+