దీపావళి వేళ దేశవ్యాప్తంగా కాలుష్య భయాలు-టపాసులపై నిషేధాలు, గ్రీన్ క్రాకర్లు-ఎక్కడెక్కడంటే ?
కరోనాతో రెండేళ్ల పాటు దీపావళి పండుగకు దాదాపు దూరమైన జనానికి ఈ ఏడాది మరో భయం పట్టుకుంది. నానాటికీ పెరిగిపోతున్న వాయుకాలుష్యం ధాటికి పండుగ జరుపుకోవాలంటే భయపడాల్సిన పరిస్దితి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దీపావళి బాణాసంచా కొనుగోళ్లు, అమ్మకాలు, వాడకంపై నిషేధం విధించాల్సిన పరిస్దితి. సుప్రీంకోర్టు కూడా తాజాగా దీన్ని సమర్ధించడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.
ఈ ఏడాది దీపావళి సంబరాల వేళ బాణాసంచా కాలిస్తే పెద్ద ఎత్తున వాయుకాలుష్యం తప్పదన్న భయాలు పలు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. వీటిలో రాజధాని నగరం ఢిల్లీతో పాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్దితి నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాలుష్య భూతాన్ని నియంత్రించేందుకు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ బాణాసంచా వాడకంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నారు.

శీతాకాలం నేపథ్యంలో కాలుష్యం ఎక్కడికక్కడే కమ్ముకోవడం ఖాయమని భావిస్తున్న ప్రభుత్వాలు, అధికారులు బాణాసంచా వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కాలుష్యం స్ధాయిలు తీవ్రంగా ఉండగా.. ఇప్పుడు దీపావళి టపాసులు కాలిస్తే పరిస్దితి మరింత విషమించే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండళ్లు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి.
అయితే కాలుష్యం కాస్త ఫర్వాలేదనే స్ధాయిలో ఉన్న కొన్ని చోట్ల మాత్రం గ్రీన్ క్రాకర్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నా రు.
శబ్ధ, వాయు కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఢిల్లీలో బాణాసంచా తయారీ, కొనుగోలు, అమ్మకాలు, వాడకంపై పూర్తిస్దాయిలో నిషేధం విధించారు. అతిక్రమిస్తే 200 నుంచి 5 వేల వరకూ జరిమానా, గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష విధించాలని నిర్ణయించారు. ముంబైలోనూ అనుమతిలేకుండా బాణాసంచా విక్రయిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేవలం రెండు గంటలు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చే అవకాశం కల్పించారు. ఉదయం 6-7, సాయంత్రం 7-8 మాత్రమే బాణాసంచా కాల్చాలని పోలీసులు నియంత్రణలు విధించారు. చండీఘడ్ లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాసులు కాల్చే అవకాశం ఇచ్చారు. హర్యానా వ్యాప్తంగా కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అవకాశమిచ్చారు. బెంగాల్ వ్యాప్తంగా ఇదే పరిస్దితి. బీహార్లోని పట్నా, ముజఫర్ పూర్, గయలో బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications