సూపర్ స్టార్ రజనీకాంత్ తో పూనమ్ మహాజన్ భేటీ, ప్రత్యేక లేదు, బీజేపీ, మరి ఎందుకు ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో బీజేపీ యువమోర్చ జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ భేటీ అయ్యారు. చెన్నైలోని సూపర్ స్టార్ ఇంటికి వెళ్లిన ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ దాదాపు గంటసేపు రజనీకాంత్ తో మాట్లాడారు.

Poonam Mahajan meet Rajinikanth at his residence in Chennai

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు వరుసగా రజనీకాంత్ తో భేటీ అవుతున్నారు. రజనీకాంత్ బీజేపీలో చేరుతున్నారని జోరుగానే ప్రచారం జరిగింది. అయితే రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Poonam Mahajan meet Rajinikanth at his residence in Chennai

ఈ సందర్బంలోనే ప్రమోద్ మహాజన్ కుమార్తె సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీ కావడంతో చర్చకు దారి తీసింది. అయితే రజనీకాంత్, పూనమ్ మహాజన్ మాత్రం ఈ భేటీ విషయంలో స్పందించలేదు. రజనీకాంత్ ను పూనమ్ మహాజన్ మర్యాదపూర్వకంగానే కలిశారని. అందులో ఎలాంటి రాజకీయ ప్రధాన్యత లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP Yuva Morcha National President Poonam Mahajan met Rajinikanth at his residence in Chennai.
Please Wait while comments are loading...