మోడల్‌పై ఐపిఎస్ రేప్: పూనం పాండే స్టేట్‌మెంట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఐపియస్ అధికారి సునీల్ పరస్కార్ తనపై నిరుడు అత్యాచారం చేశాడని యువ మోడల్ ఆరోపించిన కేసులో బాలీవుడ్ నటి పూనం పాండే వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
వ్యవహారంలో పూనం పాండే పాత్రపై విచారణ జరపాలని క్రైమ్ బ్రాంచ్ భావిస్తున్నట్లు సమాచారం. వృత్తిపరమైన శత్రుత్వంతో పూనం పాండే వెనక ఉండి అంతా నడిపించిందని మోడల్ ఆరోపించింది. మోడల్ చేసిన ఆరోపణల్లో ఏ మేరకు వాస్తవం ఉందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డిఐజి పరస్కార్ తనపై అత్యాచారం చేశాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పాతికేళ్ల మోడల్ ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఫిర్యాదు చేసింది. పరస్కార్‌ను మోడల్ 2012లో కలిసిందని, అప్పుడు ఆయన ఉత్తర ప్రాంతం అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్నారని పోలీసులు అంటున్నారు.
అప్పటి నుంచి మోడల్‌తో అతను స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడని, ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని, రెండోసారి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications