బీజేపీలోకి తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు ఎంట్రీ, మోదీకి జైకొట్టిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

బహుబాషనటి, తెలుంగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు, మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అలియాస్ సుమలత బీజేపీలో చేరారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఐదేళ్లుగా స్వతంత్ర పార్టీ ఎంపీగా పని చేసిన సుమలత ఈసారి ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్టుతో మరోసారి ఎంపీగా పోటీ చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసినా చివరికి ఆమె పోరాటానికి ఫలితం లేకుండా పోయింది.

మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ఆగస్టు 5వ తేదీన శుక్రవారం అధికారికంగా బీజేపీలో చేరారు. కర్ణాటక లోక్ సభ ఎన్నికల కర్ణాటక ఇన్ చార్జ్ రాధామోహన్ అగర్వాల్ బీజేపీలోకి సుమలత అంబరీష్ కు శాలువా కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మండ్య ఎంపీ సుమలతకు బీజేపీ జెండా ఇచ్చి పార్టీలోకి ఆమెకు స్వాగతం పలికారు.

Popular actress and Mandya MP Sumalatha Ambarish has officially joined BJP

సుమలత అంబరీష్ కొడుకు అభిషేక్ అంబరీష్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సుమలతకు మద్దతు పలికారు. సుమలతతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, క్రికెటర్ దొడ్డ గణేష్ కూడా శుక్రవారం బీజేపీలో చేరారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండ్య ఎంపీ సుమలతతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, క్రికెటర్ దొడ్డ గణేష్, వారి అనుచరులు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీజీ నాయకత్వంపై అందరూ ఏకీభవించారని, అందుకే బీజేపీలో చేరుతున్నారని అన్నారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాల్లో మరోసారి నరేంద్ర మోదీ హవా నెలకొందని, ఏ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిని చాలా మంది ప్రజలు ఇష్టపడలేటం లేదని, అందుకు కారణం మోదీ వేవ్ అని బీవై విజయేంద్ర అన్నారు.

సుమలత బీజేపీలోకి వచ్చిన తరువాత ఆమె ఏం చేస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, ఈ విషయంలో సుమలత ఇప్పటికే స్పందించారని, ఆమె బీజేపీకి చెందినవారని, నేను వారిని మనసారా పార్టీలోకి స్వాగతిస్తున్నామని, అంబరీష్‌కి ఉన్న పాపులారిటీ, పార్లమెంటేరియన్‌గా ఆయన చేసిన కృషిని అందరూ గుర్తు చేసుకుంటారని, అలాంటి అంబరీష్ సతీమణి సుమలత రాకతో కర్ణాటక రాష్ట్రానికి సందేశం లాంటిదని బీవై విజయేంద్ర అన్నారు.

Popular actress and Mandya MP Sumalatha Ambarish has officially joined BJP

బీజేపీలో చేరడంపై మాట్లాడిన మండ్య ఎంపీ సుమలత ఈరోజు తన రాజకీయ జీవితంలో మరపురాని రోజు అని అన్నారు. ఐదేళ్ల క్రితం ప్రజలు తనను ఎంపీగా గెలిచారని, అంబరీష్ అభిమానులు తనకు కొండంత బలం చేకూర్చారు. బీజేపీ నాయకులు కూడా బయటి నుంచి తనకు మద్దతు ఇచ్చారని సుమలత గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ మైసూర్ వచ్చినప్పుడు తన భర్త అంబరీష్ కు నివాళులర్పించారని సుమలత గుర్తు చేసుకున్నారు.

నేను లోక్‌సభలో అడుగుపెట్టిన రోజు నుంచి బీజేపీ సీనియర్‌ నేతలు నాకు మార్గనిర్దేశం చేశారని, ప్రధాని మోదీయే నాకు స్ఫూర్తి అని, ఆయన ఆలోచనలు తనకు బాగా నచ్చాయని, ఆయన మాటలు, తనకు ఇచ్చిన సలహాలు విన్న తర్వాత బీజేపీలో చేరడం మంచిదని తాను నిర్ణయించుకున్నానని సుమలత అన్నారు. బీఎస్

యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తనకు ఎంతో సహకరించారని, మండ్య ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తనకు సహాయం చేశారని, మై షుగర్ మళ్లీ ప్రారంభించారని సుమలత అన్నారు.

బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో మండ్యకు చాలా నిధులు ఇచ్చారని, తరువాత బసవరాజ్ బోమ్మయ్ రూ 50 కోట్లు నిధులు మంజూరు చేసి మై షుగర్ రీ ఓపెన్ కు సహకరించారని సుమలత ఇదే సమయంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, మై షుగర్‌పై మరొకరు క్రెడిట్ తీసుకోవడం సరికాదని, మై షుగర్ రీ ఓపెన్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని సుమలత అన్నారు.

నా భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందడం లేదని, తనకు తన దేశం, తన రాష్ట్రం, తన మండ్య జిల్లా ప్రజలు ముఖ్యం అని, నా భవిష్యత్తు గురించి నేను చింతించడం లేదని, ఈ రోజు తాను బీజేపీలో చేరడం గర్వంగా ఉందని, ప్రజలు నాకు సహకరిస్తారనే నమ్మకం ఉందని సుమలత అంబరీష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+