అక్రమ సంబంధం, ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య, ఆఫీసులో ఏకాంతంగా, రోజూ రచ్చ, ఆర్థిక ఇబ్బందులు !
చెన్నై: కుటుంబ సమస్యల కారణంతో ప్రముఖ తమిళ టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన ఆమె భర్త ఆఫీసులో కొంత కాలం ఏకాంతంగా కాలం గడిపి తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నటి భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని అనుమానంతో నిత్యం ఇంటిలో గొడవలు జరిగేవని, రోజూ ఇదే రచ్చతో అతను విసిగిపోయాడని, దానికి తోడు ఆర్థిక సమస్యలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

ప్రేమ వివాహం
ప్రముఖ టీవీ నటి రేఖ అనేక తమిళ సీరియల్స్ లో నటించింది. రేఖ నటించిన సీరియల్స్ పాపులర్ రావడంతో ఆమెకు మంచి గర్తింపు వచ్చింది. అనేక ప్రైవేట్ టీవీ చానల్స్ లో ప్రసారం అవుతున్న షోలకు రేఖ యాంకర్ గా పని చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం గోపినాథ్ (33) అనే వ్యక్తిని రేఖ ప్రేమించి వివాహం చేసుకుంది.

అక్రమ సంబంధం
వివాహం జరిగిన తరువాత రేఖ, గోపినాథ్ దంపతులు సంతోషంగానే ఉన్నారు. తరువాత గోపినాథ్ వేరే మహిళతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని, తనను నిర్లక్షం చేస్తున్నాడని రేఖ పసిగట్టింది. ఈ విషయంలో రేఖ, గోపినాథ్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి.

ఇంటిలో రచ్చ రచ్చ
అక్రమ సంబంధం విషయంలో రాత్రి ఇంటిలో రేఖ, గోపినాథ్ ల మధ్య మళ్లీ గొడవలు మొదలైనాయి. ఇద్దరి మధ్య వాదనలు తారాస్థాయికి చేరడం, రచ్చ ఎక్కువ కావడంతో గోపినాథ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయాడు. రేఖ మాత్రం ఇంటిలోనే ఉంది. గోపినాథ్ నేరుగా అతని కార్యాలయానికి వెళ్లిన తరువాత కొందరు స్నేహితులతో మాట్లాడి కొంతసేపు ఏకాంతంగా ఉన్నాడని తెలిసింది.

ఆఫీసులో ఆత్మహత్య
రాత్రి కార్యాలయంలో ఒంటిగా ఉన్న గోపినాథ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఆఫీసుకు వెళ్లిన సిబ్బంది విషయం గోపినాథ్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి రేఖకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్య రేఖతో ఉన్న గొడవలతో పాటు గోపినాథ్ కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిసిందని, అందుకే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు విచారణలో ఉందని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications