పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్, మోదీ వచ్చే రోజు గ్యారెంటీ అంటున్న లీడర్స్, అందుకేనా!
అయోధ్యలో తొలిసారిగా శ్రీరామ నవమిని వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకను పురస్కరించుకుని రామరాజ్యాన్ని నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారని కర్ణాటకలోని చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థి డాక్టర్ కే. సుధాకర్ అన్నారు. శ్రీ రామనవమి అంటే ఆదర్శ పరిపాలకుడు, మహోన్నతుడైన పురుషోత్తమ భగవానుడు శ్రీ రామచంద్రుని అవతరించిన పవిత్ర దినం అని డాక్టర్ సుధాకర్ అన్నారు.
శ్రీరామచంద్రుడు ఇప్పుడు తన స్వస్థలమైన అయోధ్యలో ఒక గొప్ప ఆలయంలో నివసిస్తున్నాడని, ఈ సంవత్సరం శ్రీ రామనవమి భారతీయులందరికీ చాలా ప్రత్యేకమైన రోజు అని చిక్కబళ్లాపురం నియోజకవర్గం ఎన్ డీఏ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామరాజ్య నిర్మాణం కోసం చాలా కష్టపడ్డారని డాక్టర్ సుధాకర్ అన్నారు. ఇదే సమయంలో డాక్టర్ సుధాకర్ కాంగ్రెస్ పై పరోక్ష దాడికి దిగారు.

ప్రధాని నరేంద్ర మోదీ కృషితో శ్రీరాముని వనవాసానికి విముక్తి లభించిందని, అందుకే అయోధ్యలో రామ మందిరం నిర్మించారని డాక్టర్ సుధాకర్ అన్నారు. ఐదు వందల ఏళ్ల పోరాట ఫలితమే రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం జరిగిందని డాక్టర్ సుధాకర్ అన్నారు. యావత్ ప్రపంచ చరిత్రలో ఒక మతపరమైన క్షేత్రం కోసం ఇంత నిరంతర పోరాటం, త్యాగం ఎప్పుడూ జరగలేదని చిక్కబళ్లపురం లోక్‌సభ నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థి సుధాకర్ అన్నారు.
గత పదేళ్లలో కోట్లాది మంది పేదలను ప్రధాని మోదీ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారని, హిందూ పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేశారని డాక్టర్ సుధాకర్ అన్నారు. డాక్టర్ సుధాకర్ ను గెలిపించాలని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర రోడ్ షో నిర్వహించారు. చిక్కబళ్లాపురంలో బుధవారం జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించాల్సి ఉంది.
అయితే అనివార్య కారణాల వలన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిక్కబళ్లాపురం రాలేకపోయారని బీజేపీ నాయకులు తెలిపారు. ఇదే నెలలో చిక్కబళ్లాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ బహిరంగ పాల్గొంటారని, అదే రోజు పవన్ కల్యాణ్ కూడా చిక్కబళ్లాపురం వస్తారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారా ? అనే సందేహాలు మొదలైనాయి.












Click it and Unblock the Notifications