Pradhan Mantri Kisan Samman Nidhi: దసరా కానుక ప్రకటించిన మోదీ
రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకను ప్రకటించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అక్టోబర్ 5వ తేదీన నిధులను విడుదల చేయబోతోంది. ఇది- 18వ వాయిదా చెల్లింపు. దీనిద్వారా దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలను ముమ్మరంగా కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించినట్టవుతుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత వాయిదా చెల్లింపుల కోసం అర్హులైన రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. దసరా పండగ సందర్భంగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) రూపంలో దీన్ని జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. డీబీటీ విధానంలో లబ్దిదారులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను జమ చేయడం వల్ల ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆర్థికంగా ఆదుకున్నట్టవుతుంది.

18వ వాయిదా కింద డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లల్లో జమ అయిన వెంటనే వారి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ అందుతుంది. ఏటీఎం ద్వారా దీనికి సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ను తీసుకోవచ్చు లేదా వారి డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి బ్యాలెన్స్ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా- ఏటీఎం కార్డు లేని రైతులు 18వ విడత నగదు డిపాజిట్ అయినట్లు నిర్ధారించుకోవడానికి రసీదును సైతం తీసుకునే వెసలుబాటు ఉంది. పాస్‌బుక్‌తో బ్యాంక్‌ను సందర్శించవచ్చు. ఎంత మొత్తం జమ అయినది తెలుసుకోవచ్చు. ఆ మొత్తాన్ని పాస్ బుక్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత నిధులు చెల్లింపులు వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ఆదుకుంటోందనే విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలోఉన్న మోదీ ప్రభుత్వం రాజీ పడట్లేదు. ఇచ్చిన హామీల మేరకు ఎప్పటికప్పుడు వాయిదాలను విడుదల చేస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications