Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ సెక్స్ స్కాండల్ సీడీ తెలిసినా మోదీ పక్కన కుర్చున్నారా ?, కాంగ్రెస్ సూటిపోటిమాటలు !

ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అనేక అసభ్యకర వీడియోల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, దయచేసి బీజేపీ-జేడీఎస్ కూటమిని ఏర్పాటు చేయవద్దని 2003లో బీజేపీకి ఆ పార్టీకి చెందిన నాయకుడు రహస్య లేఖ' రాశారు. అయినా కూడా బీజేపీ నాయకులు జేడీఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? హాసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వేదిక పంచుకున్నారు అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల గురించి 2003లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు హాసన్ జిల్లాలోని నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి జి. దేవరాజేగౌడ లేఖ రాశారు. ఈ లేఖ మీకు అందినా కూడా కేవలం లోక్ సభ ఎన్నికల కోసం జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Prajwal Revanna is a BJP leader who wrote to the high command a year ago about the obscene videos

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా బీజేపీకి చెందిన జి. దేవరాజ్ గౌడ ఆ పార్టీ నాయకులకు లేఖ రాసినా ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరా బీజేపీ పెద్దలను ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 8వ తేదీ బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడికి దేవరాజ్ గౌడ లేఖ రాశారని, లేఖ చూసిన తరువాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ ఖేరా ప్రశ్నించారు.

ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం గురించి, ఆయన పెన్ డ్రైవ్ గురించి తెలిసి కూడా బీజేపీ నాయకులు జేడీఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, సీరియల్ రేప్ లు చేసిన వాటిని వీడియో రికార్డ్ చేసి పెన్ డ్రైవ్‌లో ఉంచిన ప్రజ్వల్ రేవణ్ణ మీద ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీకు ముందే తెలిసినా చర్యలు తీసుకోవడం మానేసి ఆయనతో ప్రధాని మోదీ వేదిక ఎందుకు పంచుకున్నారు? అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రశ్నించారు.

ప్రజ్వల్ రేవణ్ణ ప్రపంచంలోనే అతి పెద్ద మర్మమైన లైంగిక హింస కింగ్ పిన్ గా పేరు తెచ్చుకున్నాడని, అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేశారు? ప్రజ్వల్ రేవణ్ణకు మీ కూటమి నుంచి ఎంపీ టిక్కెట్ ఎందుకు ఇచ్చారు ? అని పవన్ ఖేరా ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోవడానికి ఎవరు సహకరించారు?, మీ బీజేపీ-జేడీఎస్ కూటమిలో ఇంత జరిగినా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని బీజేపీ నాయకులు బహిరంగంగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఘాటుగా ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+