ప్రజ్వల్ రేవణ్ణ కొత్త వీడియో

Prajwal Revanna: పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్న కొడుకు, లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. జర్మనీ నుంచి ఆయనను స్వదేశానికి రప్పించడానికి సిట్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించాయి.

రెండు నెలల కిందట ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో బయటికి వచ్చిన వెంటనే ఆయన దేశం విడిచారు. జర్మనీకి వెళ్లిపోయారు. ఇన్ని రోజులుగా ఆయన అక్కడే ఉంటోన్నారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశలో అంటే ఏప్రిల్ 26వ తేదీన ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హాసన్ స్థానానికి పోలింగ్ ముగిసింది.

Prajwal Revanna released a new video and said he will appear before SIT on May 31

ఓటింగ్ ముగిసిన మరుసటి రోజే ప్రజ్వల్ రేవణ్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయనను స్వదేశానికి రప్పించడం, ఆ కేసుపై సమగ్ర దర్యాప్తును జరిపించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బ్లూ కార్నర్ నోటీస్ సైతం ప్రజ్వల్‌పై జారీ అయింది.

ఇదే కేసులో ఆయన తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణ సైతం అరెస్ట్ అయ్యారు. సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొన్నారు రేవణ్ణ. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.

జర్మనీ నుంచి ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించడానికి కర్ణాటక ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు సాగించింది. ఆయనకు కేటాయించిన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. చట్టపరంగా విచారణను ఎదుర్కొనక తప్పదంటూ కుమారస్వామి సైతం చెప్పుకొచ్చారు.

ఈ పరిణామాల మధ్య ప్రజ్వల్ రేవణ్ణ కొత్త వీడియోను విడుదల చేశారు. తాను స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవుతాననీ చెప్పారు. రాహుల్ గాంధీ వంటి జాతీయ స్థాయి నాయకులు సైతం తన అంశాన్ని బహిరంగ వేదికలపై తప్పుదారి పట్టించేలా స్టేట్‌మెంట్లు ఇస్తోన్నారని, ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేడానికి ప్రయత్నాలు చేస్తోన్నారని చెప్పారు.

ఇదంతా చూసిన తరువాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఐసొలేషన్‌లో ఉన్నానని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. అందుకే ఇన్ని రోజులు తాను బయటికి రాలేదని చెప్పారు. హాసన్‌లో కూడా తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఏకం అయ్యాయని, లేనిపోని దుష్ప్రచారం సాగిస్తోన్నాయని విమర్శించారు.

రాజకీయంగా తాను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని, అందుకే తొక్కేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తాను సిట్ సమక్షానికి విచారణకు హాజరై.. అసలు విషయాలను వెల్లడిస్తానని చెప్పారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వివరించారు. చట్టాలు, న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని, తనపై జరుగుతున్న కుట్రల నుంచి బయటపడతానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+