లంబి నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నామినేషన్ దాఖలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్న్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును మరింత పెంచాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. అధికార కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, బీజేపీ, బీఎస్పీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం వ్యూహ ప్రతి వ్యూహలతో ముందుకు వెళ్తున్నాయి. అటు నామినేషన్ల పర్వం ఊపందుకుంది.
Recommended Video
జలాలాబాద్ బరిలో సుఖబీర్ సింగ్ బాదల్
వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ సీఎంలు నామినేషన్ దాఖలు చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాలలో నామినేషన్ దాఖలు చేశారు. అటు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖబీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ కార్యాలయాలకు వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
లంబి నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీ
మరో వైపు శిరోమణి అకాలీదళ్ పార్టీ వ్యవస్థాపకుడు, సుఖబీర్ సింగ్ బాదల్ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ లంబి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఈమేరకు ఆయన తన అనుచరులతో కలిసి ర్యాలీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. లంబి నుంచి పోటీ చేస్తున్న ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

బీజేపీతో కటీఫ్.. బీఎస్పీతో దోస్తీ..
గత ఎన్నికల్లో బీజేపీతో పొట్టుపెట్టుకున్న శిరోమణి అకాలీదళ్ ఈసారి ఆపార్టీతో పొత్తుకు గుడ్ బై చెప్పింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో జత కట్టి బరిలోకి దిగింది. బీఎస్పీ పొత్తు ద్వారా పంజాబ్‌లోని దళితుల మద్దతు కూడగట్టుకోవచ్చని శిరోమణి అకాలీదళ్ భావిస్తుంది. అటు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం ద్వారా రైతుల మద్దతు కూడా తమకు కలిసివస్తోందని ధీమా వ్యక్తం చేస్తుంది.












Click it and Unblock the Notifications