స్టాలిన్ కు సెల్యూట్: విజయ్ ప్రమాణస్వీకారం వేళ ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్
తమిళనాడు ఎన్నికల్లో గత వారం రోజులుగా నెలకున్న నరాలు తెగే ఉత్కంఠకు బ్రేక్ పడింది. కొద్దిసేపటిక్రితమే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో టీవీకే విజయ్ భేటీ అయ్యారు. తనకు మద్దతిచ్చిన పార్టీల లేఖలను గవర్నర్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కోరారు. ఇక విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం ప్రమాణస్వీకారానికి విజయ్ సిద్ధం అవుతున్నారు. మరోవైపు తమిళనాడులో టీవీకే ఏర్పాటుకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీలక ట్వీట్ చేశారు. టీవీకే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మెజారిటీ సీట్లు రాకపోయినా గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని స్టాలిన్ స్పష్టం చేశారు.
అలాగే కొత్త ప్రభుత్వానికి తాము అడ్డుపడబోమని నిర్ణయాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ మెజారిటీ లభించని పరిస్థితిలో తమ మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. అలాగే సమన్వయంతో వ్యవహరించాలని స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా చూడాలన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని .. కాంగ్రెస్ తో అదే రోజు సంబంధాలు తెగిపోయాయని స్టాలిన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇక కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్, విదుతలై చిరుతైగళ్ కచ్చి పార్టీ నాయకుడు తిరుమాళవన్.. తాము డీఎంకే పార్టీతో చేతులు కలిపి ప్రక్షల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.
అయితే స్టాలిన్ ట్వీట్ కు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక రిప్లై ఇచ్చారు. ఈ మేరకు స్టాలిన్ కు సెల్యూట్ చేశారు. స్టాలిన్ ట్వీట్ కు సెల్యూట్ అని పోస్టు చేశారు. ప్రకాశ్ రాజ్ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల కూడా స్టాలిన్ కీలక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ కీలక ట్వీట్ చేశారు.

తమిళనాట చరిత్రలో కామరాజు ఓడిపోయారు.. ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయారు అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సమాజం అంటే కేవలం అభిమానుల మయం అయిపోయిందని అన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన సమాజం మారలేదనడానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనం అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షంలోనే అని పేర్కొన్నారు. మన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం.. విజేతలకు, వారు చేయబోయే ప్రజా సేవకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications