Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీ మృతి వార్త తెలిసి బాధేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. క్రమశిక్షణ, నిబద్ధతతో నమ్మిన సిద్దాంతాల కోసం వ్యుహాత్మకంగా పనిచేసిన గొప్ప యోధుడు ప్రణబ్ ముఖర్జీ అని తెలిపారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Pranab Mukherjee Dead:country loss great statesman: ap cm jagan

ప్రణబ్ మృతి వార్త కలచివేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గొప్ప ఆర్థికవేత్త అని కీర్తించారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఏపీ హోంమంత్రి సుచరిత తెలిపారు. గత 5 దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలు మరువలేనివని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+